ENGLISH

హేమక్క తోపు.. మాట నిలబెట్టుకోలేదేం పాపం.!

01 November 2019-16:30 PM

బిగ్‌బాస్‌ సీజన్‌ 3 లాస్ట్‌ జర్నీలో భాగంగా హౌస్‌ నుండి ఎలిమినేట్‌ అయిన మిగిలిన కంటెస్టెంట్లను తిరిగి హౌస్‌లో ప్రవేశపెట్టి టాప్‌ 5 కంటెస్టెంట్స్‌ని సర్‌ప్రైజ్‌ చేయనున్నాడు బిగ్‌బాస్‌. తాజా ఎపిసోడ్‌లో హౌస్‌ మొత్తం నిండుగా కలర్‌ ఫుల్‌గా మారనున్నట్లు ఓ ప్రోమో ద్వారా ఆడియన్స్‌కి హింట్‌ ఇచ్చారు బిగ్‌బాస్‌ టీమ్‌. పాత, కొత్త హౌస్‌ మేట్స్‌ అల్లరి చేష్టలతో నిజంగానే హౌస్‌ సందడిగా మారినట్లు కనిపిస్తోంది. ఇకపోతే, హౌస్‌ నుండి బయటికి వెళ్లాకా ఒక్కొక్కరు తమ తమ అనుభవాల్ని తమకు నచ్చిన విధంగా పంచుకున్న సంగతి తెలిసిందే. బిగ్‌బాస్‌ హౌస్‌ నుండి మొట్ట మొదట ఎలిమినేట్‌ అయిన కంటెస్టెంట్‌గా హేమక్క నిలిచింది.

 

హౌస్‌లో ఉన్న వారం రోజులూ, ఇంటికి పెద్ద దిక్కుగా, అందరి చేత హేమక్క అని పిలిపించుకుంది. హేమక్క తోపు అంటూ ఆమెను ఇంట్లోంచి బయటికి నెట్టేశారు.. అంటూ బయటికొచ్చాకా ఫన్నీ కామెంట్స్‌ కూడా చేసింది హేమ. హేమ హౌస్‌లో ఉన్నది వారం రోజులే అయినా ఆ వారం రోజుల్లోనే హౌస్‌ మేట్స్‌ మధ్య గొడవలు, స్నేహం, ప్రేమ, ఆదరణ, కన్నింగ్‌.. ఇలా అన్ని రకాల ఎక్స్‌ప్రెషన్స్‌నీ చూసేసింది. ఆ దెబ్బకి మళ్లీ బిగ్‌బాస్‌లోకి వెళ్లే అవకాశమొస్తే వెళతారా? అని ఓ సందర్భంలో ఆమెని అడిగితే, 'బాబోయ్‌ బిగ్‌బాస్‌కి ఓ నమస్కారం .. మళ్లీ వెళ్లి పరువు తీసుకోలేను..' అని సంచలన వ్యాఖ్యలు చేసింది. కానీ, ఈ రోజు బిగ్‌హౌస్‌లో ప్రత్యక్షమైంది. అయితే, ఇది జస్ట్‌ గెస్ట్‌ ఎంట్రీనే కాబట్టి లైట్‌ తీసుకుంది కాబోలు. కంటెస్టెంట్‌గా మళ్లీ పంపిస్తే చచ్చినా వెళ్లను అని ఖచ్చితంగా చెప్పేసింది.

ALSO READ: స్టన్నింగ్‌ రోల్‌లో 'గరుడవేగ' బ్యూటీ!