ENGLISH

'మహానటి' అలా ఫిక్సయ్యిందా?

21 September 2018-13:00 PM

అందాల భామ కీర్తి సురేష్‌ 'మహానటి' సినిమాలో తన పర్‌ఫామెన్స్‌తో అలనాటి సావిత్రిని మరిపించింది. అందుకే ఆమె పర్‌ఫామెన్స్‌కి ఆడియన్స్‌ అంతలా ఫిదా అయిపోయారు. ఆమె కెరీర్‌లో కనీ వినీ ఎరుగని సూపర్‌ హిట్‌ని ఆమెకి కట్టబెట్టారు. అలాంటి సూపర్‌ హిట్‌ కొట్టాక ఏ హీరోయిన్‌కైనా ఫుల్‌ క్రేజ్‌ వచ్చేస్తుంది. క్రేజ్‌ అయితే కీర్తికి కూడా వచ్చింది కానీ, అవకాశాలు మాత్రం ప్చ్‌. 

అయితే తెలుగులో అవకాశాలు రాకపోవడానికి కీర్తినే కారణమంటున్నారు. కథలు వింటున్నా, ఏ కథకీ ఓకే చెప్పడం లేదు కీర్తి అంటూ ఓ పక్క టాక్‌ వినిపిస్తుంటే, మరో వైపు ఈ ట్రెండ్‌ స్టోరీస్‌కి కీర్తి సూట్‌ అయ్యేలా లేదనీ అందుకే, నయా ట్రెండ్‌ స్టోరీస్‌కి కీర్తిని పక్కన పెట్టేస్తున్నారంటూ టాక్‌ వినిపిస్తోంది. ఇది కేవలం తెలుగుకు సంబంధించిన టాక్‌ మాత్రమే. 

తమిళంలో కీర్తిసురేష్‌ జోరు బాగానే ఉంది. అయితే మరోటాక్‌ ఏంటంటే, సీనియర్‌ హీరోస్‌కి ఆప్షన్‌గా మారింది కీర్తి సురేష్‌ అంటూ ప్రచారం జరుగుతోంది. దీన్ని బట్టి అర్ధం చేసుకునేదేంటంటే కీర్తి కాస్త బరువు తగ్గాలంటున్నారు. బరువు తగ్గి నాజూకుగా మారితే తప్ప ఆమెకు ట్రెండీ హీరోయిన్‌గా అవకాశాలు దక్కడం కష్టమే అంటున్నారు. అయితే తమిళ తంబీలకు బొద్దు భామలే ఇష్టం. అందుకే అక్కడ కీర్తిసురేష్‌కి తిరుగే లేదంట. 

ఏమో ఈ ప్రచారంలో నిజమెంతుందో ఏమో కానీ, టాలీవుడ్‌లో కీర్తి జోరు తగ్గి, పర్‌ఫామెన్స్‌తో పాటు, గ్లామర్‌ యాంగిల్‌ కూడా ఉన్న రష్మికా మండన్నా వంటి హీరోయిన్లు దూసుకెళ్తున్నారు. మరి టాలీవుడ్‌లో కీర్తిసురేష్‌ పరిస్థితేంటో.

ALSO READ: 'దేవదాస్‌' సీక్వెల్‌ చేయాలనుంది - నాగ్‌