ENGLISH

హాట్‌ అండ్‌ స్పైసీ 'ఒంగోలు గిత్త'

09 August 2018-12:37 PM

పింక్‌ షార్ట్‌ అండ్‌ క్యూట్‌ కాస్ట్యూమ్‌లో మెరిసిపోతున్న ఈ ముద్దుగుమ్మని గుర్తు పట్టారుగా. కృతికర్బంద. 'తీన్‌మార్‌' సినిమాలో పవన్‌ కళ్యాణ్‌కి జోడీగా నటించింది. తొలి సినిమా ఫ్లాప్‌ అయినా, రెండో సినిమా రామ్‌తో నటించిన 'ఒంగోలు గిత్త'తో మంచి విజయం అందుకుంది. 'తీన్‌మార్‌'లో ట్రెడిషనల్‌ లుక్‌లో బాబాయ్‌కి జోడీగా నటించిన ఈ ముద్దుగుమ్మ ఆ తర్వాత 'బ్రూస్‌లీ' సినిమాలో అబ్బాయ్‌ రామ్‌చరణ్‌కి అక్కగా నటించింది. హీరోయిన్‌ రకుల్‌ ప్రీత్‌సింగ్‌ కన్నా, కృతికర్బంధకే ఈ సినిమాలో ప్రాధాన్యత ఉంటుంది. అయితే కమర్షియల్‌గా 'బ్రూస్‌లీ' ఆశించిన రిజల్ట్‌ అందుకోకపోవడంతో తెలుగులో దాదాపు మాయమైపోయింది ఈ ముద్దుగుమ్మ. అయితే అప్పుడప్పుడూ ఇదిగో ఇలా సోషల్‌ మీడియాలో దర్శనమిస్తుంటుంది. చూస్తున్నారుగా 'ఎక్స్‌ గేమింగ్‌' అనే మేగ్జైన్‌ కవర్‌ పేజ్‌ కోసం తన హాట్‌ హాట్‌ అందాలను ఎరగా వేసి ఎలా కనువిందు చేస్తోందో.!
 

 

ALSO READ: Qlik Here For The Gallery Of Kriti Kharbhanda