ENGLISH

డెడికేషన్‌ కేరాఫ్‌ మంచు మనోజ్‌

07 April 2017-13:19 PM

మంచు ఫ్యామిలీ నుంచి 'ఝుమ్మంది నాదం' సినిమాతో తెలుగు తెరకు పరిచయమైన హీరో మంచు మనోజ్‌. రెగ్యులర్‌ కమర్షియల్‌ సినిమాలను కాకుండా విలక్షణ సినిమాలను ఎంచుకుంటూ పయనిస్తున్నాడు. ఇటీవలే 'గుంటూరోడు' సినిమాతో మన ముందుకు వచ్చి సక్సెస్‌ అందుకున్నాడు. తన సినిమాలకు తానే స్వయంగా యాక్షన్‌ సీన్స్‌ని కంపోజ్‌ చేసుకుంటూ ఉంటాడు. అంతేకాదు యాక్షన్‌ సీన్స్‌ కోసం ఒళ్లు హూనం చేసుకుంటూ ఉంటాడు మంచు మనోజ్‌. తను నటించే పాత్ర కోసం బరువు తగ్గుతాడు. అలాగే అవసరం అనుకుంటే బరువు పెరుగుతాడు కూడా. తాజాగా 'ఒక్కడు మిగిలాడు' సినిమాలో నటిస్తున్నాడు మంచు మనోజ్‌. అజయ్‌ అండ్రూస్‌ నూతక్కి ఈ సినిమాకి దర్శకత్వం వహిస్తున్నారు. ఈ సినిమాలో మంచు మనోజ్‌ రెండు డిఫరెంట్‌ షేడ్స్‌ ఉన్న పాత్రల్లో కనిపిస్తాడు. అందులో ఒకటి ఎల్‌.టి.టి.ఈ.మిలిటెంట్‌ ప్రభాకరన్‌ పాత్ర కాగా, ఈ పాత్ర కోసం బాగా లావు పెరిగాడు మనోజ్‌. అలాగే ఇదే సినిమాలో కాలేజ్‌ కుర్రోడి పాత్ర కోసం బరువు తగ్గి స్లిమ్‌గా మారాడు. ఇలా సినిమాల్లో డెడికేషన్‌తో వ్యవహరించే అతి కొద్ది మంది హీరోల్లో మంచు మనోజ్‌ ఒకడు. టాలీవుడ్‌లోఈ స్థాయి డెడికేషన్‌ చాలా కొద్దిమందిలో మాత్రమే ఉంటుంది. ఆ డెడికేషన్‌తోనే డిఫరెంట్‌ కాన్సెప్ట్‌ ఉన్న స్టోరీలను వెతుక్కుంటూ సక్సెస్‌, ఫెయిల్యూర్స్‌తో సంబంధం లేకుండా మనోజ్‌ సినిమాలు చేసుకుంటూ పోతున్నాడు. ఈ సినిమాలో అనీషా ఆంబ్రోస్‌ మనోజ్‌కి జంటగా నటిస్తోంది.

 

ALSO READ: సినిమాలనే తన గ్యాంగ్ గా మార్చుకున్న దర్శక డాన్- ఆర్జీవీ