ENGLISH

మ‌ళ్లీ మెగా హీరోనే ప‌ట్టిన మారుతి

11 January 2020-10:30 AM

మెగా కాంపౌండ్ తో మారుతికి మంచి అనుబంధం ఉంది. మారుతి సినిమాల్లోకి రాక ముందు నుంచే ఆ కాంపౌండ్ మ‌నిషి. అల్లు శిరీష్‌తో 'కొత్త జంట‌' తెర‌కెక్కించాడు. గీతా ఆర్ట్స్ లో రూపొందిన 'భ‌లే భ‌లే మ‌గాడివోయ్‌' మారుతిని బిజీ ద‌ర్శ‌కుడిగా మార్చేసింది. మొన్న‌టికి మొన్న సాయిధ‌ర‌మ్ తేజ్ తో `ప్ర‌తిరోజూ పండ‌గే` తెర‌కెక్కించి, మ‌రో సూప‌ర్ హిట్ కొట్టాడు. ఈ హిట్‌తో మారుతికీ, మెగా కాంపౌండ్‌కీ మ‌ధ్య అనుబంధం మ‌రింత ధృఢంగా మారింది.

 

ఈసారీ మారుతి మెగా హీరోతోనే ప‌నిచేయ‌బోతున్నాడ‌ని తెలుస్తోంది. ఈసారి వ‌రుణ్‌తేజ్‌కి ఓ క‌థ చెప్పాడ‌ట‌. దానికి వ‌రుణ్ కూడా ఓకే అన్నాడ‌ని టాక్‌. ఈ చిత్రాన్ని కూడా జీఏ 2 సంస్థ‌నే తెర‌కెక్కించే అవ‌కాశాలున్నాయ‌ని తెలుస్తోంది. ప్ర‌స్తుతం వ‌రుణ్ చేతిలో ఓ సినిమా వుంది. బాక్సింగ్ నేప‌థ్యంలో సాగే సినిమాలో వ‌రుణ్ న‌టిస్తున్నాడు. కిర‌ణ్ కొర్ర‌పాటి ద‌ర్శ‌కుడు. ఫిబ్ర‌వ‌రిలో సెట్స్‌పైకి వెళ్తుంది.

 

ఆ త‌ర‌వాతే మారుతి సినిమా ఉండొచ్చు. కాక‌పోతే మారుతి అప్ప‌టి వ‌ర‌కూ ఎదురు చూస్తాడా? లేదంటే ఈలోగా మరో సినిమాని ప‌ట్టాలెక్కిస్తాడా? అనేది తెలియాల్సివుంది. 

 

ALSO READ: న‌న్ను ఇంటికి కూడా రావొద్ద‌న్నారు: చిరు గురించి మ‌హేష్ కామెంట్స్.