ENGLISH

Masooda Review: 'మసూద' మూవీ రివ్యూ & రేటింగ్ !

18 November 2022-15:42 PM

నటీనటులు: సంగీత, తిరువీర్, కావ్య కళ్యాణ్రామ్ తదితరులు
దర్శకుడు : సాయి కిరణ్
నిర్మాత: రాహుల్ యాదవ్ నక్క
సంగీత దర్శకులు: ప్రశాంత్ విహారి
సినిమాటోగ్రఫీ: నగేష్ బానెల్
ఎడిటర్: జెస్విన్ ప్రభు

రేటింగ్ : 2.75/5
 
తెలుగులో కంప్లీట్ హార్రర్ సినిమాలు వచ్చి చాలా కాలం అయిపోయింది. అయితే ఇప్పుడు ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ చిత్రంతో ఆకట్టుకున్న నిర్మాత రాహుల్ యాదవ్ నక్క నుండి ఒక హారర్ సినిమా వచ్చింది. అదే మసూద. సంగీత, తిరువీర్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన ఈ చిత్రం ట్రైలర్ ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించింది. మరి ఈ హార్రర్ మూవీ ప్రేక్షకులను ఎంతమేర భయపెట్టింది.. అసలు మసూద కథ ఏంటి ? 


కథ:


నీలమ్ (సంగీత) భర్త నుంచి విడిపోయిన తన కూతురు నాజియా కలిసి ఒక అపార్ట్మెంట్లో ఉంటుంది. అదే అపార్ట్మెంట్లో ఉండే గోపి (తిరువీర్) నాజియా కుటుంబంతో ఒక ఫ్యామిలీ మెంబర్ లా ఉంటాడు. అంతా సజావుగా సాగిపోతున్న సమయంలో నాజియ ఒక రోజు దెయ్యం పట్టినట్లు విచిత్రంగా ప్రవర్తించడం మొదలుపెడుతుంది. నాజియాని పీర్ బాబా దగ్గరికి తీసుకెళ్తారు. ఆమెను మసూద అనే ఆత్మ పట్టి పీడిస్తోందని పీర్ బాబా చెబుతాడు. ఇంతకీ ఆ మసూద ఎవరు.. నాజియాను ఆమె ఎందుకు ఆవహించింది ? మూసూద నాజియా శరీరం నుండి బయటికి వచ్చిందా లేదా ? అనేది మిగతా కథ. 


విశ్లేషణ:


కొత్త దర్శకుడు సాయికిరణ్ మసూద కథ కోసం కాస్త కొత్త నేపధ్యాన్నే పట్టుకున్నాడు. మసూద నేపధ్యం చాలా ఫ్రెష్ గా భయానకంగా వుంటుంది. అయితే దిన్ని హారర్ గా ప్రజంట్ చేసి వుంటే బావుండేది. కానీ హారర్ ని తగ్గించి వైలెన్స్ ని పెంచడంతో హారర్ మరుగున పడి మితిమీరిన హింసగా మాత్రమే కనిపిస్తుంది.  


ఈ కథని దర్శకుడు చాలా ఆసక్తికరంగా మొదలుపెట్టాడు. అయితే అసలు కథని రెండు సీన్ల తర్వాత ఆపేసి .. మళ్ళీ ఇంటర్వెల్ వరకూ కథని ముందుకు కదలనివ్వలేదు. ఈ గ్యాప్ లో రొటీన్ హారర్ సినిమాల సీన్లే కనిపిస్తాయి. నీలమ్, నాజియా, గోపి పాత్రల పరిచయం, ఆఫీస్ , పార్ట్మెంట్ లో జరిగే సన్నీవేశాలు సాగాదీతగా లేజీగా వుంటాయి. నాజియాకి దెయ్యం పట్టిన తర్వాత వచ్చే సీన్స్ కూడా రొటీన్ గానే వుంటాయి. ఇంటర్వెల్ బాంగ్ లో మసూద అనే పేరు తెరపైకి వస్తుంది. దాన్ని తర్వాత వచ్చే సీన్స్ కొన్ని ఆసక్తికరంగా వుంటాయి. 


ద్వితీయార్ధంలో వచ్చిన మసూద నేపధ్యం గగుర్పాటుకు గురి చేస్తుంది. అయితే మసూద పాత్రని కేవలం మాటలతోనే పరిచయం చేసి కొన్ని భయనాక సీన్లు చూపించారు. మసూద నేపధ్యం ఆ పాత్ర బ్యాక్ స్టొరీ కూడా చూపించి వుంటే ఈ కథ మరింతగా ఆసక్తికరంగా వుండేది. ఐతే దర్శకుడు ఆ దిశగా అలోచించలేదు. ఐతే ద్వితీయార్ధంలో హారర్ కాస్త ఒక దశలో హింసగా మారిపోవడం కూడా ఈ చిత్రానికి ప్రధాన మైనస్. మిగింపు కూడా చాలా సుదీర్గంగా సాగుతూ ప్రేక్షకుడి సహనానికి పరీక్ష పెడుతుంది,.  


నటీనటులు:


సంగీత నటన గురించి ఇప్పుడు ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అయితే చాన్నాళ్ల తర్వాత ఆమెకు కీలక పాత్ర దక్కింది. నీలమ్ పాత్రకు పూర్తిగా న్యాయం చేసింది. తిరువీర్ మరోసారి తన ప్రతిభ చూపించాడు. తిరు నటన సహజంగా వుంది. నాజియా పాత్రలో చేసిన బాంధవి శ్రీధర్ నటన ఆకట్టుకుంటుంది. కావ్య కళ్యాణ్ రామ్, శుభలేఖ సుధాకర్, సత్యం రాజేష్ మిగతా పాత్రలన్నీ పరిధిమేర వున్నాయి.  


సాంకేతిక వర్గం: 'మసూద'కు టెక్నికల్ మంచి మార్కులు పడతాయి. . ప్రశాంత్ విహారి నేపథ్య సంగీతం హార్రర్ మూడ్ ని క్రియేట్ చేసింది. విజువల్స్ ఆకట్టుకుంటాయి ఎడిటింగ్ఇంకా షార్ఫ్ గా ఉండాల్సింది. నిర్మాణ విలువలు డీసెంట్ గా వున్నాయి. దర్శకుడు మంచి నేపధ్యాన్ని పట్టుకున్నాడు. అయితే దాన్ని ప్రజంట్ చేయడం వైలెన్స్ డామినేట్ చేసింది. హారర్ కాస్త వైలెన్స్ గా మారిపోయింది. 

 
ప్లస్ పాయింట్స్ 


కథా నేపధ్యం 
నటీనటులు 
నిర్మాణ విలువలు 


మైనస్ పాయింట్స్ 


మితిమీరిన హింస 
సాగాదీత 
రొటీన్ ఫస్ట్ హాఫ్ 


ఫైనల్ వర్డిక్ట్ : భయం... హింస