ENGLISH

బాలయ్యతో ముమైత్‌ ఐటెం సాంగ్‌?

11 May 2017-18:30 PM

బాలయ్య - పూరీ కాంబినేషన్‌లో తెరకెక్కుతోన్న సినిమాలో ఐటెం బాంబ్‌ ముమైత్‌ ఖాన్‌తో స్పెషల్‌ సాంగ్‌ ఉండబోతోందని అనుకుంటున్నారు. సాంగ్‌ మాత్రమే కాదు ముమైత్‌కి ఈ సినిమాలో కొన్ని సీన్స్‌ కూడా ఉండబోతున్నాయని ప్రచారం జరుగుతోంది. గతంలో పూరీ డైరెక్షన్‌లో వచ్చిన 'పోకిరి' సినిమాలో 'ఇప్పటికింకా నా వయసు నిండా పదహారే..' అంటూ ఎంట్రీ ఇచ్చి భారీ అందాలతో దాడి చేసింది ముమైత్‌ ఖాన్‌. ఐటెం గాళ్స్‌లో ఓ సెన్సేషన్‌ ముమైత్‌ ఖాన్‌. ఆ పాట ఇప్పటికీ ఎప్పటికీ ఐటెం సాంగ్స్‌లో ఊపు ఊపేసే సాంగే. ఆ తర్వాత రవితేజతో 'నేనింతే' సినిమాలో ముమైత్‌ ఖాన్‌కి కీలక పాత్ర ఇచ్చాడు పూరీ. అయితే చాన్నాళ్లుగా ముమైత్‌ ఖాన్‌ సినిమాల్లో కనిపించడం లేదు. మొన్నీ మధ్యనే బాలయ్యతో ఓ స్పెషల్‌ సాంగ్‌లో అలా మెరిసి వెళ్లి పోయింది. చాన్నాళ్ల తర్వాత మళ్లీ పూరీ కాంబినేషన్‌లో ముమైత్‌ ఐటెం సాంగ్‌కి రంగం సిద్ధమవుతోందని తెలియ వస్తోంది. అయితే ఈ సినిమాలో ముమైత్‌ ఓన్లీ ఐటెం సాంగే చేస్తుందా? లేక వ్యాంప్‌ తరహా పాత్రలో పాత్రలో ఏమైనా నటిస్తుందా అనేది సస్పెన్సే ప్రస్తుతానికి. ఈ సినిమాలో బాలయ్య గ్యాంగ్‌ స్టర్‌గా కనిపించనున్నాడంటూ ప్రచారం జరుగుతోంది. ముగ్గురు భామలు ఈ సినిమాలో హీరోయిన్లుగా నటిస్తున్నారు. వారిలో ముద్దుగుమ్మ శ్రియ ఒన్‌ ఆఫ్‌ ది హీరోయిన్‌. 

 

ALSO READ: బాహుబలి 2కి హిందీలో నెం1 పొజిషన్