ENGLISH

అఖిల్‌ని ఎందుకు లాగుతారు నాగబాబు గారూ.!

10 January 2019-15:30 PM

కొద్ది రోజుల క్రితం అఖిల్‌ ఫ్రెంచ్‌ బుల్‌ డాగ్‌తో ఫోటో దిగాడు. తాజాగా అదే ఫ్రెంచ్‌ బుల్‌ డాగ్‌తో మెగా బ్రదర్ నాగబాబు కూడా ఫోటో దిగి ఆ ఫోటోని సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేశాడు. అఖిల్‌ పెంపుడు కుక్క అది. దీని పేరు ఫ్రెంచ్‌ బుల్‌ డాగ్‌ అని అందరికీ తెలిసిందే. అయితే ఈ ఫోటోతో నాగబాబు కనిపించడం కూడా బాలయ్య ఫ్యాన్స్‌కి తంటా తెచ్చింది. ఆ ఫోటోని కూడా తమకి ఆపాదించేసుకుని బాలయ్య ఫ్యాన్స్‌ రచ్చ చేస్తున్నారు. 

 

ఇకపోతే అఖిల్‌ నటిస్తున్న తాజా చిత్రం 'మిస్టర్‌ మజ్ను'లో నాగబాబు కూడా నటిస్తున్నాడు. ఈ రోజుతో ఆ సినిమా షూటింగ్‌ పూర్తయిపోయింది. ఈ సందర్భంగా ఆన్‌ లొకేషన్‌ నాగబాబు ఈ ఫోటో దిగారు. అదే ఫోటోని లేటెస్టుగా పోస్ట్‌ చేశారు. ఈ ఫోటో ఇప్పుడు బాలయ్య ఫ్యాన్స్‌కి వివాదమైంది. నాగబాబు ఏం చేసినా సోషల్‌ మీడియాలో బాలయ్య ఫ్యాన్స్‌కి ఫైర్‌ ఇంజన్లు లేస్తున్నాయ్‌. 

 

ఏం కామెంట్‌ పెడతారా,? దానికి ఎలాంటి కౌంటర్‌ వేద్దామా అంటూ ఎదురు చూస్తున్నారు. నాగబాబు కూడా ఏమాత్రం తగ్గకుండా పోటీకి సై అంటే సై అంటూ తలపడుతున్నారు. ఇక ఈ రోజు లాస్ట్‌ కామెంట్‌ పోస్ట్‌ చేస్తానని, ఈ కామెంట్‌తో ఈ ఆపరేషన్‌ కౌంటర్‌కి ఫుల్‌ స్టాప్‌ పెట్టేస్తానని నాగబాబు చెప్పారు. ఆ కామెంట్‌ ఏమై ఉంటుందా.? అని ఇటు మెగా ఫ్యాన్స్‌, అటు బాలయ్య ఫ్యాన్స్‌ ఎదురు చూస్తున్నారు. 

ALSO READ: రజినీ, అజిత్ ఫాన్స్ మధ్య కత్తులతో దాడి.. నలుగురి పరిస్థితి విషమం