ENGLISH

గ్లామ్‌షాట్‌: 'ఐటెం' కాదు అందాల బాంబ్‌

21 December 2017-11:27 AM

ఈ ఫోటోలో రెడ్‌ హాట్‌గా మెరిసిపోతోన్న ఈ బ్యూటీని గుర్తు పట్టడం కొంచెం కష్టమే అయినా, చాలా సుపరిచితురాలు. తెలుగులో పలు ఐటెం సాంగ్స్‌లో మెరిసింది. పేరు నోరా ఫతేహి. 'టెంపర్‌'లో ఐటెం సాంగ్‌ చేసింది. ఆ సాంగ్‌లో అమ్మడు చేసిన డాన్సుకి అంతా ఫిదా అయిపోయారు కూడా. అలాగే 'బాహుబలి ది బిగినింగ్‌'లో 'మనోహరీ..' పాటలో ప్రబాస్‌తో వయ్యారాలొలికించిన ముగ్గురు భామల్లో ఒకరిగా ఈ ముద్దుగుమ్మ రొమాంటిక్‌ స్టెప్పులేసింది. అలాగే 'ఊపిరి'లో కార్తితో చిందేసిన ఐటెం గాళ్‌ కూడా ఈ ముద్దుగుమ్మే. ఇంకా 'షేర్‌', కిక్‌ - 2', 'లోఫర్‌' తదితర చిత్రాల్లో ఐటెం సాంగ్స్‌లో మెరిసింది. ఐటెం గాళ్‌ అయినా కానీ అందంలో మాత్రం చందమామే ఈ ముద్దుగుమ్మ. ఓ అవార్డు ఫంక్షన్‌ కోసం ఇలా రెడ్‌ హాట్‌ గౌనులో తళుక్కున మెరిసింది. కెమెరా కళ్లు చెదిరేలా ఆమె అందంతో కట్టి పడేస్తోందిలా ఈ బ్యూటీ!