ENGLISH

'అలెక్స్‌' ప్రియాంక: సీజన్‌-3కి రెడీనా?

10 January 2018-13:27 PM

బాలీవుడ్‌లో ప్రియాంకా చోప్రాని 'పిగ్గీ చాప్స్‌' అనీ, 'పీసీ' అనీ అభిమానులు పిలుచుకుంటుంటారు. ఈ బ్యూటీ హాలీవుడ్‌కి వెళ్ళాక 'క్వాంటికో గర్ల్‌' అయిపోయింది. 'క్వాంటికో' టీవీ సిరీస్‌తో హాలీవుడ్‌ బ్యూటీగా మారిన ప్రియాంక చోప్రా, అందులో అలెక్స్‌ పర్రిష్‌ అనే పాత్రలో కన్పిస్తోంది. సీజన్‌ 1, సీజన్‌ 2 సూపర్‌ హిట్స్‌ కావడంతో, ఇంకా ఉత్సాహంగా క్వాంటికో సీజన్‌ 3ని ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేస్తున్నారు. 

ఏప్రిల్‌ 26 నుంచి క్వాంటికో మూడో సిరీస్‌ బుల్లితెర వీక్షకుల్ని కనువిందు చేయనుంది. పేరుకి ఇది టీవీ సిరీస్‌ అయినా, హాలీవుడ్‌ సినిమా రేంజ్‌లో దీన్ని రూపొందిస్తున్నారు. హాలీవుడ్‌కి వెళ్ళాక ప్రియాంక చోప్రా ఆలోచనలూ మారిపోయాయి. అచ్చంగా హాలీవుడ్‌ హీరోయిన్‌లా మారిపోవడమే కాకుండా, గ్లామరస్‌ పరంగానే మరింత హాట్‌గా కనిపించేస్తోందక్కడ. ఈ క్రమంలోనే ఆమె టూ పీస్‌ బికినీలతో ఫొటోలకు పోజులివ్వడం, హాలీవుడ్‌ ఆఫర్స్‌ కొల్లగొడుతుండడం తెలిసిన విషయాలే కదా! 

బీచ్‌ అండ్‌ బికినీ క్రైమ్‌ థ్రిల్లర్‌ కాన్సెప్ట్‌తో ఒకప్పుడు టీవీ సిరీస్‌గా పాపులర్‌ అయిన 'బేవాచ్‌'ని సినిమాగా మలిచారు. అందులో ప్రియాంక చోప్రా నటించింది. మరికొన్ని ఆఫర్స్‌ కూడా ప్రియాంకా చోప్రా చేతిలో ఉన్నాయి. బాలీవుడ్‌ అవకాశాల్ని మిస్‌ అవుతున్నందుకు బాధగా ఉన్నా, హాలీవుడ్‌లో అవకాశాల్ని వెతుక్కోవడం కోసం కొంత త్యాగం చేయక తప్పడంలేదని ప్రియాంక అంటోంది. అయినా ప్రపంచం టెక్నాలజీ కారణంగా కుగ్రామం అయిపోవడంతో తాను హాలీవుడ్‌లో ఉన్నా ఇండియన్‌ ఆడియన్స్‌ బ్లెస్సింగ్స్‌ తనకెప్పుడూ ఉంటాయని చెప్పింది ఈ బ్యూటీ.

 

ALSO READ: Qlik Here For The Gallery