ENGLISH

పూరి నుంచి బ్లాక్‌బస్టర్‌ ఆశించగలమా?

10 February 2018-10:56 AM

టాలీవుడ్‌లో 'సంచలన దర్శకులు' అనదగ్గ అతి కొద్దిమంది దర్శకుల్లో ఖచ్చితంగా పూరి జగన్నాథ్‌ పేరు వుండి తీరుతుంది. గతంలో ఆయన తీసిన సూపర్‌ హిట్స్‌ అలాంటివి. కానీ ఈ మధ్య ఎందుకో పూరి జగన్నాథ్‌ నుంచి, ఆయన స్థాయికి తగ్గ సినిమాలైతే రావడంలేదు. వచ్చిన సినిమాలు వచ్చినట్లే బాక్సాఫీస్‌ వద్ద పరాజయాల్ని చవిచూస్తున్నాయి. అలాగని పూరి జగన్నాథ్‌ ఇమేజ్‌ తగ్గిందా? అంటే అదీ లేదు. అదే పూరి జగన్నాథ్‌ ప్రత్యేకత. 

'పోకిరి' సక్సెస్‌ ఇచ్చేముందూ పూరి, కొన్ని పరాజయాల్ని చవిచూశాడు. ఏదో అనుకోకుండా 'పోకిరి' తనకు తగిలిన సూపర్‌ హిట్‌ అని పూరి చెబుతుంటాడు. 'టెంపర్‌'కి ముందూ పూరి ఫ్లాపుల్ని చూశాడు. ఇప్పుడు మళ్ళీ 'మెహబూబా' సినిమాకి ముందు కూడా పూరి ట్రాక్‌ రికార్డ్‌ ఏమంత బాగాలేదు. కానీ 'మెహబూబా' సినిమా టాలీవుడ్‌లో హాట్‌ టాపిక్‌ అయ్యింది. తన కుమారుడు పూరి ఆకాష్‌తో, పూరి జగన్నాథ్‌ తెరకెక్కిస్తోన్న సినిమా ఇది. 

దాంతో తనయుడికోసం పూరి, సూపర్‌ హిట్‌ సినిమా తెరకెక్కించబోతున్నాడని అందరూ నమ్ముతున్నారు. దానికి తగ్గట్టే టీజర్‌ని పూరి తీసుకొచ్చాడు. టీజర్‌కి దక్కుతున్న ప్రశంసల సంగతి పక్కన పెడితే, మేకింగ్‌లో పూరి స్పార్క్‌ ఇదివరకటి హిట్‌ చిత్రాల్లో వున్నట్లే కన్పిస్తోందని ఇన్‌సైడ్‌ సోర్సెస్‌ సమాచారాన్ని బట్టి తెలుస్తోంది. హిట్‌ కాదు, సూపర్‌ హిట్‌ కాదు, బ్లాక్‌ బస్టర్‌ మూవీని పూరి 'మెహబూబా'తో అందించబోతున్నాడనే అభిప్రాయం చిత్ర యూనిట్‌ వర్గాల్లో వ్యక్తమవుతోంది. పూరి ఆకాష్‌ సరసన నేహా శెట్టి ఈ సినిమాలో హీరోయిన్‌గా నటిస్తోంది. తెలుగులో ఆమెకిదే తొలి సినిమా.

 

ALSO READ: నాని ‘అ’ షాకింగ్ సెన్సార్ రిపోర్ట్