ENGLISH

లీకు బాబులకు క్లాసు పీకిన బోల్డ్‌ బ్యూటీ!

18 July 2019-12:00 PM

మీరు చూపిస్తే తప్పు లేదు కానీ, మేం చూస్తే తప్పా? అనేది కుర్రకారు డైరెక్ట్‌గా సంధిస్తున్న ప్రశ్న. అసలింతకీ ఎవరి గురించి సంధించారో ఈ ప్రశ్న అర్ధం చేసుకోలేనంత అమాయకులు మీరేం కాదని మా అభిప్రాయం. అయితే, అసలు మ్యాటర్‌లోకెళ్లిపోదాం. బోల్డ్‌ బ్యూటీగా రాధికా ఆప్టేకి మంచి పేరే ఉంది. చేసేదంతా ఏదో చెప్పేదేమో శ్రీరంగ నీతులు.. అనే మాట వర్తించే నిఖార్సయిన సెలబ్రిటీ బ్యూటీల్లో ఈ భామ పేరు ముందు వరసలోనే ఉంటుందనడం అతిశయోక్తి కాదేమో. తెలుగులో రాధికా ఆప్టే బాలయ్యతో రెండు సినిమాల్లో నటించింది.

 

ఆ తర్వాత ఆయనపై చేసిన కామెంట్లు అన్నీ ఇన్నీ కావు. అదంతా పాత సంగతే. తాజా విషయమేంటంటే, ఈ బోల్డ్‌ భామ ఇప్పుడు 'వెడ్డింగ్‌ గెస్ట్‌' అనే హాలీవుడ్‌ మూవీలో నటిస్తోంది. ఈ సినిమా ఇండియాలో అఫీషియల్‌గా త్వరలో విడుదల కానుంది. ఆ సినిమాని ప్రమోట్‌ చేయాలి కదా.. అందుకే ఏదో ఒక గొడవ లేవనెత్తుకుని వచ్చింది. అసలింతకీ రాధికా ఆప్టే బాధేంటంటే.. ఈ సినిమాలోని కొన్ని బోల్డ్‌ సీన్లు లీకై, ఈ మధ్య సోషల్‌ మీడియాలో హాట్‌ హాట్‌గా అవైలిబుల్‌ అయిపోయాయి.

 

అయ్యో రాధికా ఆప్టే బెడ్‌రూమ్‌ సీన్‌ చూశారా.? అంటూ.. ఆ నోటా ఈ నోటా ఈ సీన్లు తెగ పాపులర్‌ అయిపోయాయ్‌లెండి.. ఆ పాయింట్‌ని పట్టుకుని తన సినిమాని ప్రమోట్‌ చేసుకోవడానికి వచ్చిందీ భామ. ఆ సీన్‌లో రాధికా ఆప్టే మాత్రమే కాదు, మేల్‌ యాక్టర్‌ దేవ్‌ పటేల్‌ కూడా ఉన్నాడు. అలాంటిది దేవ్‌ పేరు ఎత్తకుండా, రాధికా ఆప్టే పేరునే ఎందుకు ప్రచారం చేస్తారు.? అయినా ఆ సినిమాలో చాలా అందమైన సీన్లుంటే, ఈ సీన్లు మాత్రమే లీక్‌ చేయాలి.. వ్యతిరేకిస్తున్నట్టు కనిపిస్తూనే ఆ సీన్లతో ఎందుకు క్యాష్‌ చేసుకోవాలి.. అంటూ రాధికా ఆప్టే లీకు బాబులకు ఫుల్‌గా క్లాస్‌ పీకింది.

ALSO READ: 'ఇస్మార్ట్‌ హిట్‌' పక్కా అంటోన్న ఇస్మార్ట్‌ టీమ్‌!