ENGLISH

రామ్ చరణ్ చేసిన పనికి షాక్ లో మెగా ఫాన్స్..

25 January 2018-11:54 AM

నిన్న సాయంత్రం విడుదలైన రంగస్థలం టీజర్ మెగా అభిమానుల్లోనే కాక సామాన్య ప్రజానీకాన్ని కూడా బాగా ఆకట్టుకుంది. ముఖ్యంగా దర్శకుడు సుకుమార్ ఈ చిత్రంలో హీరోని చూపించబోతున్న విధానాన్ని రెండు ముక్కల్లో చెప్పేశాడు. 

ఇక చిట్టిబాబు అలియాస్ సౌండ్ ఇంజనీర్ పాత్రలో రామ్ చరణ్ అదరగొట్టేశాడు అని ఆ టీజర్ చూస్తే చాలు చెప్పేయొచ్చు. ఇవన్ని పక్కన పెడితే ఈ టీజర్ కి ఎంతటి ఆదరణ లభించింది అని అంటే- ఇప్పటివరకు ఈ టీజర్ కి సుమారు 7.5 మిలియన్ డిజిటల్ వ్యూస్ వచ్చాయి.

ఈ వ్యూస్ బట్టే చెప్పొచ్చు ఈ టీజర్ ఎంతలా హిట్ అయిందో అని. చెర్రీ అభిమానులు అయితే ఆయన నివాసం ముందు టపాసులు పేల్చి తమ ఆనందం వ్యక్తం చేశారు, ఇందుకు ప్రతిగా చరణ్ కూడా- ఇంతటి ఆదరణ ఇస్తున్నందుకు కృతజ్ఞతలు అని చెప్పాడు.  

మార్చ్ 30వ తేదీన ఈ సినిమా ప్రేక్షకుల ముందుకి రానున్న తరుణంలో ఈ టీజర్ కచ్చితంగా సినిమా పైన అంచనాలు పెంచేసింది అని చెప్పొచ్చు. అయితే సమంతా ఈ టీజర్ లో కనపడనందుకు ఆమె అభిమానులు కొంచెం బాధ పడిన త్వరలోనే ఆమె పైనే మరో టీజర్ వస్తుంది అని తెలియడంతో ఆనంద పడ్డారు సామ్ ఫ్యాన్స్.

 

ALSO READ: Qlik Here For Rangasthalam Teaser