ENGLISH

రాజుగారి రొమాంటిక్‌ చపాతి టేస్ట్‌ చూస్తారా?

07 July 2017-16:40 PM

భళ్లాలదేవగా 'బాహుబలి' సినిమాతో అలరించిన రానా, త్వరలోనే 'నేనే రాజు నేనే మంత్రి' సినిమాతో ప్రేక్షకుల ముందుకు రానున్నాడు. తేజ డైరెక్షన్‌లో తెరకెక్కుతోన్న ఈ సినిమాలో చందమామ కాజల్‌ రానాతో జత కడుతోంది. పొలిటికల్‌ బ్యాక్‌ డ్రాప్‌లో ఈ సినిమా తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. కానీ సినిమాలో రానా, కాజల్‌ జంట మాత్రం పిచ్చ పిచ్చగా నచ్చేస్తోంది. ఈ జంట మధ్య కెమిస్ట్రీకి ఆడియన్స్‌ శాంతం ఎట్రాక్ట్‌ అవుతున్నారు. అంత బావుంది మరి. తాజాగా ఈ సినిమా రిలీజ్‌ డేట్‌ని అనౌన్స్‌ చేస్తూ చిత్ర యూనిట్‌ ఓ పోస్టర్‌ని విడుదల చేసింది. ఈ పోస్టర్‌ చూస్తే ఎంతటి వారికైనా రొమాంటిక్‌ ఫీల్‌ కలగక మానదు. రానా, కాజల్‌ రొమాంటిక్‌గా చపాతీ పిండి కలుపుతున్నట్లుగా ఉంది పోస్టర్‌లో. ఇటీవల విడుదలైన 'నేనే రాజు నేనే మంత్రి' ట్రైలర్‌ మంచి రెస్పాన్స్‌ అందుకుంది. ఆ ట్రైలర్‌లో కూడా వీరిద్దరి మధ్యా కెమిస్ట్రీని సూపర్బ్‌గా చూపించాడు డైరెక్టర్‌ తేజ. తేజ తన మార్కుకి భిన్నంగా ఈ సినిమాని అందరూ మెచ్చేలా తెరకెక్కించబోతున్నాడట. ఈ సినిమా ఆగష్టు 11న ప్రేక్షకుల ముందుకు రానుంది. తెలుగులోనే కాదు, తమిళంలో కూడా సినిమా తెరకెక్కుతోంది. తెలుగు, తమిళ భాషల్లో ఒకేసారి ఈ సినిమాని విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు. సురేష్‌ ప్రొడక్షన్స్‌ బ్యానర్‌లో ఈ సినిమా తెరకెక్కుతోంది. అనూప్‌ రూబెన్స్‌ అందించిన మెలోడియస్‌ మ్యూజిక్‌ అలరించనుంది. 

ALSO READ: నిన్ను కోరి మూవీ రివ్యూ & రేటింగ్స్