ENGLISH

బచ్చన్ వసూళ్లు ఎంత?

23 August 2024-14:42 PM

మాస్ మహారాజ రవితేజ హీరోగా, హరీష్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కిన "మిస్టర్ బచ్చన్" మూవీ ఆగస్టు 15 థియేటర్స్ లో సందడి చేసింది. ఈ సినిమా మొదటి రోజు తెలుగు రాష్ట్రాలలో డీసెంట్ కలెక్షన్స్ రాబట్టింది. రవితేజ లాస్ట్ మూవీ ఈగల్ మొదటి రోజు కలెక్షన్స్‌తో పోల్చుకుంటే, మిస్టర్ బచ్చన్ చాలా తక్కువ వసూళ్లు చేసినట్లు టాక్. సినిమాకి పాజిటివ్ టాక్ వస్తోందని, మెల్లగా కలెక్షన్స్ పెరుగుతాయని దర్శకుడు హరీష్ శంకర్ చెబుతున్నారు. మిస్టర్ బచ్చన్ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ కూడా అప్పుడే  స్టార్ట్ చేశారు. పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ నిర్మించిన ఈ మూవీ యాక్షన్, కామెడీ ఎంటర్టైనర్‌గా ప్రేక్షకులను ఆకట్టుకుంది. భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ మూవీ మొదటి రోజు వరల్డ్ వైడ్‌గా మంచి షేర్ రాబట్టింది. 


తెలుగు రాష్ట్రాల్లో మిస్టర్ బచ్చన్ 4.56 కోట్లు వసూల్ చేసింది.  నైజాం ఏరియాలో 2.10 కోట్లు, సీడెడ్ ఏరియాలో 73 లక్షలు, ఉత్తరాంధ్రలో 50 లక్షలు, గోదావరి జిల్లాల్లో 46 లక్షలు, గుంటూరులో 38 లక్షలు, కృష్ణా జిల్లాలో 21 లక్షలు, నెల్లూరులో 18 లక్షలు కలెక్షన్లు రాబట్టింది. మొత్తం ఆంధ్రప్రదేశ్, తెలంగాణా రాష్ట్రాల్లో మిస్టర్ బచ్చన్ 6.40 కోట్ల గ్రాస్‌ కలెక్షన్లను రాబట్టడం విశేషం. ఈ మొత్తం కలెక్షన్లలో 20 లక్షలు ప్రీమియర్ షోలు ద్వారా వచ్చిన మొత్తం కూడా ఉంది. కర్ణాటక, రెస్టాఫ్ ఇండియా ఏరియాలలో ఈ సినిమా 32 లక్షల షేర్‌ రాబట్టింది. 


ఓవర్సీస్ మార్కెట్‌లో మిస్టర్ బచ్చన్ 38లక్షల షేర్‌ను వసూల్ చేసింది.  టోటల్ గా వరల్డ్ వైడ్‌గా ఫస్ట్ డే కలక్షన్స్ 5.26 కోట్ల సాధించింది. మొత్తం గ్రాస్ కలెక్షన్ 7.80 కోట్లుగా నమోదైంది. మొదటి రోజు కలెక్షన్స్ పరంగా డబుల్ ఇస్మార్ట్ కంటే మిస్టర్ బచ్చన్ వెనకపడ్డాడు. లాంగ్ రన్ కలెక్షన్స్ ద్వారా ఈ రెండిటి కలక్షన్స్ లెక్క తేలుతుంది.  మిక్స్డ్ రివ్యూలు, మిక్స్డ్ పబ్లిక్  టాక్ తో ఈ సినిమాలు మరిన్ని కలక్షన్స్ రాబట్టవచ్చు.