ENGLISH

సాయి పల్లవికి బిగ్‌ ప్రమోషన్‌

22 December 2017-12:16 PM

'ఫిదా' బ్యూటీ జోరు పెంచేసింది. మొదట్లో సెలక్టివ్‌గానే సినిమాలు చేస్తానన్న ఈ ముద్దుగుమ్మ ఇప్పుడు జోరు పెంచింది. ఇటు టాలీవుడ్‌లోనూ, అటు కోలీవుడ్‌లోనూ కూడా అమ్మడి హవా కొనసాగుతోంది. ఇప్పటికే టాలీవుడ్‌లో ఈ ముద్దుగుమ్మ తొలి సినిమా 'ఫిదా'తోనే అందరి మనసుల్ని కొల్లగొట్టేసింది. చాలా సింపుల్‌గా, నేచురల్‌గా కనిపించే ఈ బ్యూటీలోని గ్రేస్‌ని అందుకోవడం ఎవ్వరి వల్లా కావడం లేదు. ఎవరినైనా ఇట్టే డామినేట్‌ చేసేస్తుంది తన నటనతో. లేటెస్టుగా నానితో 'మిడిల్‌ క్లాస్‌ అబ్బాయి' సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది.

ఇదిలా ఉండగా, ఈ బ్యూటీ ఇప్పుడు మరిన్ని క్రేజీ ప్రాజెక్టులు సొంతం చేసుకుంటోంది. తమిళంలో ఇప్పటికే ఇళయదళపతి విజయ్‌ సరసన 'రు' సినిమాలో నటిస్తోంది. తాజాగా సూర్య హీరోగా తెరకెక్కుతోన్న ఓ సినిమాకి సాయి పల్లవిని హీరోయిన్‌గా ఎంచుకున్నారనీ అఫీషియల్‌ సమాచారమ్‌. తమిళ అగ్ర హీరోల్లో ఒకరిగా కొనసాగుతోన్న హీరో సూర్య. సూర్యకి తమిళంతో పాటు తెలుగులో కూడా మంచి క్రేజ్‌ ఉంది. ఆ రకంగా ఈ సినిమా సాయి పల్లవికి డబుల్‌ ధమాకా అని చెప్పొచ్చు. ఇంతవరకూ సాయి పల్లవి నటించిన సినిమాలన్నీ బడ్జెట్‌ పరంగా చిన్న సినిమాలే. కానీ ఈ తాజా ప్రాజెక్టు బడ్జెట్‌ పరంగా బిగ్‌ ప్రాజెక్ట్‌ అని చెప్పొచ్చు.

ఈ సినిమాతో సాయి పల్లవి స్టార్‌ హీరోయిన్‌గా ఎదిగేందుకు అవకాశాలు మెండుగా ఉంటాయనడంలో అతిశయోక్తి కాదు. ఏది ఏమైనా కెరీర్‌ మొదట్లోనే బిగ్‌ ప్రాజెక్ట్స్‌ని పట్టేస్తోందీ బ్యూటీ. అందానికి అందం, ఫిజిక్‌కి ఫిజిక్‌. అన్నింటికీ మించి యాక్టింగ్‌ టాలెంట్‌. ఇవన్నీ వెరసి ఈ బ్యూటీ స్టార్‌ హీరోయిన్‌ అనిపించుకోవడానికి పెద్దగా టైం పట్టదనిపిస్తోంది.

ALSO READ: అక్కినేని 'హలో' అదిరిపోయే రీ లాంఛ్‌ అవుతుందా?