ENGLISH

శమంతకమణి భలే ఉంది

14 July 2017-16:19 PM

యంగ్‌ డైరక్టర్‌ శ్రీరామ్‌ ఆదిత్య మరో సారి భళా అనిపించుకున్నాడు. గతంలో 'భలే మంచి రోజు' సినిమాతో హిట్‌ అందుకున్నాడు. తాజాగా 'శమంతకమణి' అనే డిఫరెంట్‌ జోనర్‌ సినిమాని ఎత్తుకుని, మరో హిట్‌ని తన ఖాతాలో వేసుకున్నాడు. నలుగురు హీరోల్ని డీల్‌ చేయడం అన్నది చిన్న విషయం కాదు. స్టార్‌డమ్‌ సంగతి పక్కన పెడితే, నాలుగు బలమైన క్యారెక్టర్స్‌ని బ్యాలెన్స్‌ చేయడంలో ఈ యంగ్‌ డైరెక్టర్‌ సూపర్‌గా సక్సెస్‌ అయ్యాడు. ఈ రోజే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చింది. నారా రోహిత్‌, ఆది, సందీప్‌ కిషన్‌, సుధీర్‌బాబు ఈ సినిమాలో హీరోలు. నలుగురూ నలుగురే. చాలా బాగా నటించారు. న్యూ కాన్సెప్ట్‌, స్క్రీన్‌ప్లే అదిరిపోయింది. థ్రిల్లింగ్‌ ఎలిమెంట్స్‌ ప్రేక్షకున్ని సీట్లోంచి కదలనీయకుండా చేశాయి. ఇంతమంది కాస్టింగ్‌లోనూ, సీనియర్‌ నటుడు రాజేంద్రప్రసాద్‌ నటన, ఆయన పండించిన కామెడీ అందర్నీ ఆకట్టుకునేలా చేశాయి. ఆయన అనుభవం ఎంతో ప్లస్‌ అయ్యింది. ఎవరికి వారే ఈ సినిమాలో నటించాం అన్నట్లుగా కాకుండా జీవించాం అన్నట్లు కనిపించారు. నలుగురికీ, శమంతకమణి మంచి సినిమా అవుతుంది. నిర్మాణం విషయంలోనూ ఎక్కడా రాజీపడకుండా సినిమాకి రిచ్‌ లుక్‌ తీసుకొచ్చారు. నలుగురు హీరోల్లో ఒకరు ఎక్కువ, ఒకరు తక్కువ అని కాకుండా, అందరికందరూ బాగా నటించారు. థ్రిల్లింగ్‌ కాన్సెప్ట్‌కి వినోదాన్ని జోడించి, తెరకెక్కించడంలో ఈ సినిమాతో డైరెక్టర్‌ శ్రీరామ్‌ ఆదిత్య మరోసారి సక్సెస్‌ అయ్యాడు. మొత్తానికి ఈ మినీ మల్టీస్టారర్‌ సైలెంట్‌గా వచ్చి డిఫరెంట్‌గా హిట్‌ పట్టుకెళ్లిపోయిందనే చెప్పాలి. 

 

ALSO READ: శమంతకమణి మూవీ రివ్యూ & రేటింగ్స్