ENGLISH

స్టార్‌ హీరోకి లైంగిక వేధింపులు

28 July 2017-12:48 PM

మామూలుగా లైంగిక వేధింపులంటే అమ్మాయిలకే అనుకుంటాం. కానీ అబ్బాయిలూ లైంగిక వేధింపులకు గురవుతున్న ఘటనలు చూస్తున్నాం. చిన్నప్పుడు తానూ లైంగిక వేధింపులకు గురైనట్లు బాలీవుడ్‌ స్టార్‌ హీరో అక్షయ్‌కుమార్‌ చెప్పాడు. ముంబయ్‌లో మానవ అక్రమ రవాణా అంశంపై నిర్వహించిన అంతార్జాతీయ కాన్ఫరెన్స్‌లో అక్షయ్‌ కుమార్‌ పాల్గొన్నారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ చిన్నప్పుడు తాను కూడా లైంగిక వేధింపులు అనుభవించాననీ, తన పట్ల .జరిగిన ఓ సంఘటనని అభిమానులతో పంచుకున్నారు. చిన్నప్పుడు అక్షయ్‌ కుమార్‌ తన అపార్ట్‌మెంట్‌లోని లిఫ్ట్‌లో వెళుతుంటే, లిఫ్ట్‌ బోయ్‌ తనని అక్కడక్కడా తాకేవాడట. ఆ విషయం అక్షయ్‌ పేరెంట్స్‌కి చెప్పగా, వారు ఆ లిఫ్ట్‌ బోయ్‌ని హెచ్చరించి వదిలేశారట. ఆ తర్వాత ఆ లిఫ్ట్‌ బోయ్‌ ఆలాంటి కేసుకి సంబంధించి, పోలీసులకు చిక్కడంతో, కటకటాల వెనక్కి వెళ్లాల్సి వచ్చింది.. అని అక్షయ్‌ తన లైఫ్‌లో జరిగిన సంఘటనని ఈ సందర్భంగా చెప్పారు. లైంగిక పరమైన వేధింపుల విషయంలో తల్లితండ్రులు తమ పిల్లల పట్ల అప్రమత్తంగా ఉండాలనీ, అలాగే పిల్లలు కూడా ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడు వెంటనే తమ పెద్దలకు చెప్పాలనీ అప్పుడే ఇలాంటి పనులకు పాల్పడే వారికి సరిగ్గా బుద్ది చెప్పగలం అని అక్షయ్‌ సూచించారు. ప్రస్తుతం అక్షయ్‌ 'టాయ్‌లెట్‌ - ఏక్‌ ప్రేమకథ' సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమా ఆగష్టు 11న ప్రేక్షకుల ముందుకు రానుంది. 

ALSO READ: 'సిట్‌' ముందు హాజరైన మాస్‌ మహరాజ్‌