ENGLISH

'శ్రద్ధ'గా స్ట్రేటజీ మార్చేసిన జక్కన్న.?

19 April 2019-17:30 PM

రాజమౌళి ప్రతిష్ఠాత్మక చిత్రం కదా. ఆ మాత్రం శ్రద్ధ ఉండాలి మరి. ఇకపోతే ఈ శ్రద్ధ మీరు అనుకుంటున్న శ్రద్ధ కాదులెండి. ఆర్ఆర్ఆర్‌ సినిమా నుండి విదేశీ బ్యూటీ డైసీ తప్పుకోవడంతో ఎన్టీఆర్‌ జోడీకి అగమ్యగోచరమైంది. ఎన్టీఆర్‌తో జోడీ కట్టబోయే ముద్దుగుమ్మ ఖచ్చితంగా బ్రిటీష్‌ యువతి అయ్యి ఉండాలట కథలో భాగంగా. అందుకే ఏరి కోరి ఎంతో టైమ్‌ తీసుకుని మరీ డైసీని ఎంచుకుంటే, ఆమె వ్యక్తిగత కారణాల వల్ల అనూహ్యంగా రాజమౌళికి హ్యాండిచ్చేసింది. 

 

దాంతో ఆ పాత్ర కోసం మళ్లీ వేట మొదలైంది. విదేశీ భామల్ని ఎంచుకోవడమంటే అంత తేలికైన సంగతి కానే కాదు. సో రాజమౌళి స్ట్రేటజీ మార్చేశాడట. అందని ద్రాక్షల్లాంటి విదేశీ భామల కోసం ఎగబాకడం కన్నా, చేతిలో ఉన్న కథలోనే కొన్ని మార్పులు చేర్పులు చేస్తే సరిపోతుంది కదా అని భావించి, కథలో మార్పులకు రంగం సిద్ధం చేస్తున్నాడట. ఇక హీరోయిన్‌గా బాలీవుడ్‌ భామ శ్రద్ధా కపూర్‌ని పరిశీలిస్తున్నారట. 

 

ప్రస్తుతం శ్రద్ధా కపూర్‌ 'సాహో' సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే. 'సాహో'కి సంబంధించి దాదాపు శ్రద్ధా కపూర్‌ డేట్స్‌ కంప్లీట్‌ కావడంతో 'ఆర్ఆర్ఆర్‌'లో నటించేందుకు శ్రద్ధ కూడా ఆశక్తి చూపిస్తోందనీ, ఇన్‌సైడ్‌ సోర్సెస్‌ ద్వారా అందుతోన్న సమాచారమ్‌. అసలే రాజమౌళి సినిమాలో నటించాలని బాలీవుడ్‌ భామలు పిచ్చ కుతూహలంగా ఎదురు చూస్తున్నారు. అలాంటిది అవకాశమొస్తే వదులుకుంటారా.? చూడాలి మరి 'ఆర్ఆర్ఆర్‌'కి శ్రద్ధ గ్లామర్‌ యాడ్‌ అవుతుందేమో. 

ALSO READ: అలా ఇలా కాదు, నాని ఈసారి గట్టిగానే కొట్టేశాడు.!