ENGLISH

నేషనల్ అవార్డ్స్ లో సౌత్ సత్తా

23 August 2024-14:45 PM

కేంద్ర ప్రభుత్వం ఏటా ఉత్తమ సినిమాలకు జాతీయ చలనచిత్ర అవార్డులు ప్రకటిస్తుంది. అన్ని భాషలకు చెందిన సినిమాల్ని పరిశీలించి ఈ పురస్కారాలను ప్రకటిస్తారు. 1954 నుంచి నేషనల్ ఫిల్మ్ అవార్డులను అందజేస్తున్నారు. 1973 నుంచి ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియా, ఇండియన్ పనోరమతో కలిసి భారత ప్రభుత్వ డైరెక్టరేట్ ఆఫ్ ఫిల్మ్ ఫెస్టివల్స్ ద్వారా ఈ అవార్డులు అందజేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం తాజాగా 70వ నేషనల్ అవార్డులను అనౌన్స్ చేసింది. 2022లో రిలీజైన  సినిమాల్ని ఎంపిక చేస్తూ ఆగస్టు 16న అవార్డులు గెలుచుకున్న సినిమాలు, నటీనటుల లిస్ట్  విడుదల చేసింది కేంద్రం. ఈ సారి కూడా నేషనల్ అవార్డ్స్ లో సౌత్ సత్తా చాటింది. ముఖ్యంగా KGF , పొన్నియన్ సెల్వన్ అత్యధిక అవార్డ్స్ గెలుచుకున్నాయి.   


ఈ 70వ నేషనల్‌ అవార్డ్స్ లో ఉత్తమ తెలుగు సినిమాగా 'కార్తికేయ-2' , ఉత్తమ తమిళ చిత్రంగా  'పొన్నియన్ సెల్వన్1 ', ఉత్తమ కన్నడ చిత్రంగా 'కేజీఎఫ్‌-2' , ఉత్తమ మరాఠీ చిత్రంగా 'వాల్వి'  ఉత్తమ బెంగాలీ చిత్రంగా 'కాబేరి అంతరార్థన్' నేషనల్ అవార్డులు దక్కించుకున్నాయి. ఉత్తమ నటుడిగా కన్నడ నటుడు, కాంతార ఫేం రిషబ్‌ శెట్టి ఎన్నికయ్యారు. ఉత్తమ నటిగా నిత్యామీనన్, మానసి పరేఖ్‌లు నేషనల్‌ అవార్డు గెల్చుకున్నారు. తమిళ చిత్రం 'తిరుచిత్రంబళం'లోని నటనకుగానూ నిత్యామీనన్‌ ఉత్తమ నటిగా అవార్డు గెల్చుకోగా, 'కచ్ ఎక్స్‌ప్రెస్' అనే గుజరాతీ చిత్రానికి గానూ 'మానసి పరేఖ్‌' ఉత్తమ నటిగా అవార్డు గెల్చుకున్నారు.  వీరిద్దరూ కలిసి అవార్డు షేర్ చేసుకోబోతున్నారు. 


బెస్ట్ మ్యూజిక్ క్యాటగిరీలో హిందీ 'బ్రహ్మాస్త్ర' మూవీకి ప్రీతం అవార్డు విన్ అయ్యారు. బెస్ట్ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ కి పొన్నియిన్‌ సెల్వన్‌ - 1 తమిళంకి ఏఆర్‌ రెహమాన్‌ అందుకున్నారు.  బెస్ట్ లిరిక్స్ అవార్డు 'ఫోజా' సినిమాకి గాను 'నౌషద్ సాధర్ ఖాన్ ' నేషనల్ అవార్డు దక్కించుకున్నారు. బెస్ట్ ఎడిటింగ్, అండ్ బెస్ట్ సినిమా అవార్డు కూడా మలయాళ సినిమా 'ఆట్టమ్‌' దక్కింది. బెస్ట్ స్టంట్ కొరియోగ్రఫీ క్యాటగిరీలో KGF చాఫ్టర్ 2 సినిమా నేషనల్ అవార్డు విన్ అయ్యింది. బెస్ట్ ప్లే బ్యాక్‌ సింగర్‌ గా అర్జిత్‌ సింగ్‌ బ్రహ్మాస్త్ర- పార్ట్‌ 1 లో కేసరియా -పాటకి, బెస్ట్ ఫిమేల్ ప్లే బ్యాక్‌ సింగర్‌ గా  బాంబే జయశ్రీ సౌదీ వెల్లక్క సీసీ 225/2009 మూవీలో చాయుమ్‌ వెయిల్‌ పాటకి. బెస్ట్‌ కొరియోగ్రీఫీ జానీ మాస్టర్‌, సతీష్‌ కృష్ణన్‌ నేషనల్ అవార్డ్స్ అందుకున్నారు. బెస్ట్ సినిమాటోగ్రఫీ పొన్నియిన్‌ సెల్వన్‌ పార్ట్‌ - 1 కి రవి వర్మన్‌. బెస్ట్‌ సౌండ్‌ డిజైనర్‌ ఆనంద్‌ కృష్ణమూర్తి   పొన్నియిన్‌ సెల్వన్‌ - 1 .