ENGLISH

స్పైడర్‌' లవ్‌ స్టోరీ క్యూట్‌ అండ్‌ హాట్‌

15 September 2017-11:53 AM

సూపర్‌ స్టార్‌ మహేష్‌బాబు - రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ జంటగా తెరకెక్కుతోన్న చిత్రం 'స్పైడర్‌'. మురుగదాస్‌ దర్శకత్వంలో వస్తోంది ఈ చిత్రం. తాజాగా ట్రైలర్‌ విడుదలైంది. ట్రైలర్‌ వచ్చాక సినిమాపై అంచనాలు బాగా పెరిగాయి. కాన్సెప్ట్‌ కొత్తగా ఉంది. అయితే ప్రేక్షకులకు ఎలా రీచ్‌ అవుతుందో తెలీదు కానీ, మహేష్‌, రకుల్‌ లవ్‌ స్టోరీ అయితే సూపర్‌ క్యూట్‌ అండ్‌ హాట్‌గా ఉంది. రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ యాక్టింగ్‌ డిఫరెంట్‌గా ఆట్టుకుంటోంది. స్టిల్స్‌ రొమాంటిక్‌ సీన్స్‌ బాగున్నాయనిపిస్తోంది. వీరిద్దరి మధ్యా లవ్‌స్టోరీని చాలా బాగా చూపించాడు డైరెక్టర్‌ మురుగదాస్‌. 'నేనేం సూపర్‌మ్యానో, స్పైడర్‌మ్యానో కాదు. సొసైటీని ఛేంజ్‌ చేయాలని నేను అనుకోవట్లేదు..' అని మహేష్‌ చెప్పే డైలాగ్‌ అదిరిపోతోంది. ఇక రకుల్‌, మహేష్‌ మధ్య కిస్‌ కిస్‌ రొమాంటిక్‌ డైలాగ్స్‌ బాగున్నాయి. టోటల్‌గా ట్రైలర్‌ చూస్తుంటే సినిమా అన్ని వర్గాల ప్రేక్షకుల్నీ అలరించేలానే ఉంది. దేవిశ్రీ ప్రసాద్‌ మ్యూజిక్‌ ఆకట్టుకుంటోంది. టైటిల్‌ సాంగ్‌ ఆడియన్స్‌కి బాగా రీచ్‌ అవుతోంది. బ్యాక్‌ గ్రౌండ్‌ మ్యూజిక్‌ ఆకట్టుకునేలానే ఉంది. ఇక విలన్‌గా ఎస్‌.జె.సూర్య చాలా క్రూయల్‌గా అనిపిస్తున్నాడు. 'మేకల కన్నా ఎక్కువగా ఉన్న ఈ మనుషులను చంపితే తప్పేంటి?' అంటూ ఆయన చెప్పే డైలాగ్‌కి రెస్పాన్స్‌ అదిరిపోతోంది. దసరా కానుకగా ఈ నెల 27న 'స్పైడర్‌' ప్రేక్షకుల ముందుకు రానుంది.

ALSO READ: Spyder Movie Telugu Trailer