ENGLISH

అలాంటివి ఆ బ్యూటీకి అస్సలు నచ్చవు

13 October 2017-12:20 PM

ముద్దుగుమ్మ టబు తెలుగు చిత్ర సీమలో స్టార్‌ హీరోలందరితోనూ జత కట్టింది. చిరంజీవి మొదలు, నాగార్జున, బాలకృష్ణ, వెంకటేష్‌ ఇలా సీనియర్‌ స్టార్స్‌ అందరితోనూ నటించింది. వయసు ఎంత పెరిగినా ఫిగర్‌ మెయింటైన్‌ చేయడంలో టబు తర్వాతే ఎవరైనా. టాలీవుడ్‌కి ప్రస్తుతం దూరంగా ఉన్నప్పటికీ, బాలీవుడ్‌లో ఆడపా దడపా సినిమాలూ చేస్తోంది. తాజాగా ఈ ముద్దుగుమ్మ 'గోల్‌మాల్‌ ఎగైన్‌' చిత్రంలో నటిస్తోంది. ఈ చిత్రం అక్టోబర్‌ 20న ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఈ సినిమా ప్రమోషన్‌ కార్యక్రమాల్లో టబు బిజీగా పాల్గొంటోంది. ఈ సందర్భంగా బయోపిక్స్‌ విషయంలో టబు తన మనసులోని మాటను అభిమానులతో పంచుకుంది. తనకంటూ ఓ పర్సనల్‌ లైఫ్‌ ఉందనీ, ఆ లైఫ్‌ని బయోపిక్‌ ద్వారా తెర పైకి తీస్కొచ్చి, పబ్లిక్‌ చేసుకోవడం తనకిష్టం లేదనీ టబు చెప్పింది. ప్రస్తుతం బయోపిక్స్‌ హవా కొనసాగుతోంది. ప్రముఖ వ్యక్తుల జీవిత గాథల్ని తెరపై ఆవిష్కరిస్తున్నారు. అయితే నా జీవితం గురించి బయట చెప్పడం నాకిష్టం లేదంటోంది ముద్దుగుమ్మ టబు. నా పర్సనల్‌ లైప్‌ గురించి ఎవరికీ చెప్పను. అలాగే ఆటో బయోగ్రఫీ రాసుకోవాల్సిన అవసరం కూడా తనకి లేదని టబు చెప్పింది. అసలెందుకు ఈ ముద్దుగుమ్మకి బయోపిక్స్‌, ఆటో బయోగ్రఫీల విషయంలో ఇలా ఫీలవ్వాలని అనిపించిందో తెలీదు కానీ, సినిమాల విషయానికొస్తే, సీనియర్‌ హీరోయిన్లు సెకండ్‌ ఇన్నింగ్స్‌లో మంచి మంచి క్యారెక్టర్స్‌తో మళ్లీ ప్రేక్షకులకు దగ్గరవుతున్నారు. అలా టబు కూడా టాలీవుడ్‌కి రీ ఎంట్రీ ఇస్తుందేమో చూడాలి మరి. ఒకవేళ వస్తే, స్టైలిష్‌ అత్త, స్పైలిస్‌ మదర్‌ తదితర క్యారెక్టర్స్‌ ఆమె కోసం మన దర్శక, నిర్మాతలు ప్రిపేర్‌ చేసెయ్యరూ!

ALSO READ: 'రాజుగారి గది' కి సందడి వచ్చేసిందోచ్‌!