ENGLISH

గ్లామ్‌షాట్‌: 'తీన్‌మార్‌' బ్యూటీ హాటెస్ట్‌ అవతార్‌

27 October 2017-12:00 PM

'తీన్‌మార్‌', 'ఒంగోలు గిత్త' తదితర చిత్రాలతో పరిచయమైన బ్యూటీ కృతి కర్బందా. పవర్‌స్టార్‌ వంటి స్టార్‌ హీరోతో నటించినా, ఆ సినిమా ఫెయిల్‌ రిజల్ట్‌నివ్వడంతో అమ్మడికి అంతగా గుర్తింపు రాలేదు. 'బ్రూస్‌లీ' సినిమాలో రామ్‌చరణ్‌కి అక్కగా నటించింది. పెద్దగా గ్లామర్‌ పాత్రల్లో మెరవలేదు. కానీ తనలోనూ హాట్‌ అప్పీల్‌ తక్కువేం కాదంటోంది. అందుకే సోషల్‌ మీడియాలో తన హాట్‌ హాట్‌ పిక్స్‌ని ఇలా ప్రదర్శనకి పెట్టేసింది. హాట్‌ పోజిచ్చింది కానీ ముఖం చాటేసింది. ఏది ఏమైనా ముఖం దాచుకున్నా ఈ ముద్దుగుమ్మ గ్లామర్‌ మాత్రం భలే కిక్కిస్తోందిలే. ఇకపై గ్లామరస్‌ పాత్రల్లో మెరవడానికి సిద్ధమేనని ఈ ఫోటో ద్వారా అమ్మడు సంకేతాలిచ్చినట్లు కనిపిస్తోంది. తెలుగులో పెద్దగా అవకాశాలు లేనప్పటికీ బాలీవుడ్‌లో దూసుకెళ్తోంది. తాజాగా బాలీవుడ్‌లో కృతికర్బందా నటించిన ఓ చిత్రం రిలీజ్‌కి సిద్ధమైంది.

ALSO READ: Qlik Here Hot Photoshoot