ENGLISH

త్రివిక్రమ్‌ హ్యాండ్‌ నితిన్‌కి కలిసొచ్చేనా?

14 February 2018-12:29 PM

'లవర్స్‌డే' సందర్భంగా యంగ్‌ హీరో నితిన్‌ తన లవ్‌ స్టోరీని చెబుతున్నాడు. 'వర్షాకాలంలో కలుసుకున్న మేం. శీతాకాలంలో ప్రేమించుకుని, వేసవికాలంలో విడిపోయాం..' అంటూ తన లవ్‌స్టోరీని సింపుల్‌గా చెప్పేశాడు. నితిన్‌ నటిస్తున్న కొత్త చిత్రం 'చల్‌ మోహనరంగా'కి సంబంధించిన టీజర్‌ని చిత్ర యూనిట్‌ తాజాగా విడుదల చేసింది. 

ఆ టీజర్‌లో నితిన్‌ చెబుతున్న మాటలే ఇవి. మేఘా ఆకాష్‌, నితిన్‌తో జత కడుతోందీ సినిమాలో. కళ్యాణ్‌ కృష్ణ దర్శకత్వం వహిస్తున్నారు. పవన్‌ కళ్యాణ్‌ క్రియేటివ్‌ వర్క్స్‌ బ్యానర్‌లో ఈ సినిమా రూపొందుతోంది. తాజాగా విడుదలైన టీజర్‌కి మంచి రెస్పాన్స్‌ వస్తోంది. 'అ,ఆ..' సినిమాతో హిట్‌ కొట్టి, స్టార్‌ హీరోల లిస్టులోకి చేరిపోయినట్లు కనిపించిన నితిన్‌, ఆ తర్వాత ఆ సక్సెస్‌ని కొనసాగించలేకపోయాడు. 'అ,ఆ' తర్వాత వచ్చిన 'లై' నిరాశ పరచడంతో నితిన్‌ రేసులో మళ్లీ వెనకబడిపోయాడు. తాజాగా తెరకెక్కుతోన్న ఈ చిత్రం పైనే నితిన్‌ ఆశలన్నీ. 

ఈ సినిమాకి త్రివిక్రమ్‌ కథనందించారు. తమన్‌ మ్యూజిక్‌ కంపోజ్‌ చేశాడు. త్రివిక్రమ్‌ తెరకెక్కించిన 'అ,ఆ' సినిమాతోనే నితిన్‌ దశ తిరిగింది. సెన్సేషనల్‌ విజయం అందుకున్నాడు ఆ సినిమాతో. తన కెరీర్‌ బెస్ట్‌ మూవీగా 'అ,ఆ..' నితిన్‌ కెరీర్‌లో ఎప్పటికీ నిలిచిపోతుంది. అలాగే ఈ తాజా చిత్రంలోనూ త్రివిక్రమ్‌ హ్యాండ్‌ ఉంది. త్రివిక్రమ్‌ హ్యాండ్‌ మరోసారి నితిన్‌కి కలిసొస్తుందో లేదో చూడాలి మరి. కూల్‌ సమ్మర్‌లో కూల్‌ రొమాంటిక్‌ అండ్‌ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా 'చల్‌ మోహనరంగా' చిత్రాన్ని ఏప్రిల్‌ 5న ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నారు.

ALSO READ: CHAL MOHAN RANGA OFFICIAL TEASER