ENGLISH

'అంతరిక్షం'లో వరుణ్‌తేజ్‌

15 August 2018-11:58 AM

మెగా ప్రిన్స్‌ వరుణ్‌ తేజ్‌ నటిస్తున్న తాజా చిత్రానికి టైటిల్‌ ఫిక్స్‌ చేసేశారు. ప్రచారంలో ఉన్న 'అంతరిక్షం' టైటిల్‌నే ఈ సినిమాకి ఫిక్స్‌ చేశారు. స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా 'అంతరిక్షం 9000 కెఎమ్‌పీహెచ్‌' అని టైటిల్‌ లోగోతో కూడిన ఫస్ట్‌లుక్‌ని రిలీజ్‌ చేశారు. 

ఆస్ట్రోనాట్‌ గెటప్‌లో అంతరిక్షంలో ఏదో పరిశీలిస్తున్నట్లుగా ఉన్న వరుణ్‌తేజ్‌ గెటప్‌ సూపర్బ్‌గా ఉంది. చేతికి ఇండియన్‌ ఫ్లేగ్‌ ఉంది. విభిన్న కాన్సెప్ట్‌ చిత్రాల దర్శకుడు సంకల్ప్‌ రెడ్డి ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు. గతేడాది 'ఘాజీ' అంటూ సబ్‌మెరీెన్‌తో సముద్రగర్భంలో జరిగే యుద్ధాన్ని కళ్లకు కట్టినట్లుగా చూపించిన సంకల్ప్‌రెడ్డి ఈ సారి మరో అద్భుత ప్రయోగం చేయబోతున్నాడీ 'అంతరిక్షం'తో. 

అదితీరావ్‌ హైదరీ, లావణ్య త్రిపాఠి హీరోయిన్లుగా నటిస్తున్నారు. విజువల్‌ అద్భుతంగా ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. ఇందుకోసం జీరో గ్రావిటీతో ఏర్పాటు చేసిన ప్రత్యేక సెట్‌లో చిత్రీకరణ జరిపారు. ఈ సినిమా కోసం వరుణ్‌తేజ్‌, అదితీ రావ్‌ హైదరీపై త్రీడీ స్కానింగ్‌ కూడా నిర్వహించారు. హీరోయిన్స్‌లో అదితీ రావ్‌ హైదరీ పాత్రకు ఎక్కువ ప్రాధాన్యత ఉండబోతోందని తెలుస్తోంది. 

తెలుగు సినిమా రీచెస్‌ స్పేస్‌ అంటూ విడుదలైన ఈ పోస్టర్‌ అందర్నీ ఆకట్టుకుంటోంది. తెలుగు సినీ చరిత్రలోనే ఇలాంటి కాన్సెప్ట్‌తో సినిమా రూపొందుతుండడం ఇదే తొలిసారి కావడం విశేషం.
 

 

ALSO READ: యంగ్‌ టైగర్‌ దూసుకొచ్చేస్తోందిలా.!