ENGLISH

ఆషామాషీ 'సంకల్పం' కాదిది

27 April 2018-10:39 AM

'తొలిప్రేమ' సినిమా తర్వాత మెగా ప్రిన్స్‌ వరుణ్‌తేజ్‌ ఓ ప్రయోగాత్మక చిత్రంలో నటిస్తున్న సంగతి తెలిసిందే. 'ఘాజీ'తో విమర్శకుల ప్రశంసలు అందుకున్న సంకల్ప్‌ రెడ్డి ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు. స్పేస్‌ సైన్స్‌ నేపథ్యంలో ఈ సినిమా కథ నడుస్తుంది. దీనికి సంబంధించి డైరెక్టర్‌ ముందుగానే చాలా రీసెర్చ్‌ చేశాడట. అంతరిక్ష వాహన నౌకలు, అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం, గ్రావిటీ లేకుండా ఉండడం తదితర అంశాలపై చాలా అధ్యయనం చేసి కథ సిద్ధం చేసుకున్నాడట డైరెక్టర్‌. కథని ప్రిపేర్‌ చేయడం కంటే, దాన్ని ఎగ్జిక్యూట్‌ చేయడం చాలా కష్టం. ఆ కష్టాన్ని తొలి సినిమా 'ఘాజీ'తోనే జయించేశాడు డైరెక్టర్‌ సంకల్ప్‌ రెడ్డి.

ఈ సినిమా తర్వాత సంకల్ప్‌ చేస్తున్న సినిమా ఇది. సాంకేతికంగా ఈ సినిమా చాలా చాలా కొత్తగా ఉండబోతోందట. టెక్నికల్‌గా గొప్పగా తెరకెక్కిన పలు చిత్రాలు ఇప్పటికే విజయవంతమయ్యాయి. అయితే వాటిన్నింటికీ అత్యంత భిన్నంగా ఈ సినిమా ఉండబోతోంది. ఈ సినిమాలో ఆస్ట్రోనాట్‌ పాత్రలో వరుణ్‌ కనిపించనున్నాడు. ఈ పాత్ర కోసం ప్రత్యేకంగా శిక్షణ పొందాడు వరుణ్‌తేజ్‌. విభిన్న కథాంశాలతో పాటు, లవ్‌స్టోరీస్‌కీ తాను ఫిట్‌ అనిపించుకున్న వరుణ్‌తేజ్‌ ఈ సినిమాతో మరో కొత్త ప్రయోగానికి తెర లేపబోతున్నాడు.

ఇంతవరకూ తెలుగు సినిమా తెరపై ఎవరూ టచ్‌ చేయని కొత్త కాన్సెప్ట్‌ ఇది. చూడాలి మరి, ఈ సినిమాతో సంకల్ప్‌రెడ్డి తన ప్రతిభని మరోసారి ప్రూవ్‌ చేసుకుంటాడేమో. అదితీరావ్‌ హైదరీ, లావణ్య త్రిపాఠి ఈ సినిమాలో హీరోయిన్లుగా నటిస్తున్నారు. ఫస్ట్‌ ఫ్రేమ్‌ ఎంటర్‌టైన్‌మెంట్స్‌ పతాకంపై ఈ సినిమా రూపొందుతోంది.

ALSO READ: 'కణం' మూవీ రివ్యూ & రేటింగ్