ENGLISH

ఈ సంక్రాంతికి ప‌ది సినిమాల‌తో జాత‌ర‌

03 January 2022-13:37 PM

సంక్రాంతి వార్ నుంచి ఆర్‌.ఆర్‌.ఆర్ త‌ప్పుకోవ‌డంతో.... చాలా సినిమాల‌కు స్పేస్ దొరికింది. ఒక‌టి కాదు, రెండు కాదు.. ఏకంగా తొమ్మిది సినిమాలు బ‌రిలో నిలిచాయి. రాధే శ్యామ్ ఎలాగూ .. సంక్రాంతికే వ‌స్తోంది. అంటే.. మొత్తం ప‌ది సినిమాల‌న్న‌మాట‌. మ‌రోవైపు బంగార్రాజు కూడా ఆఘ‌మేఘాల మీద సిద్ధం అవుతోంది.

 

డిజే టిల్లు, హీరో, రౌడీ బోయ్స్‌, సూప‌ర్ మ‌చ్చీ, 7 డేస్ - 6 నైట్స్‌, అతిథి దేవో భ‌వ‌, శేఖ‌ర్, 1945.. ఇప్పుడు ఈ పండ‌క్కి రాబోతున్నాయి. వీటితో పాటు డ‌బ్బింగ్ సినిమా వాలిమై కూడా ఉంది. అంటే.. అన్నీ కుదిరితే ఈ సంక్రాంతికి 11 సినిమాలు చూసే అకావ‌శం ఉంది. కాక‌పోతే. రాధేశ్యామ్, బంగార్రాజు త‌ప్ప అచ్చ‌మైన పండ‌గ సినిమా లేదు. అన్నీ.. సంక్రాంతి సీజ‌న్ ని క్యాష్ చేసుకోవాల‌ని చూసే సినిమాలే. వీటిలో చాలా సినిమాలు `రాధే శ్యామ్‌` రాదేమో అనే న‌మ్మ‌కంతో వ‌స్తున్నాయి. రాధేశ్యామ్ ప్ర‌మోష‌న్లు మొద‌లైపోయి, వ‌చ్చేస్తుంద‌న్న సంకేతాలు అందేస్తే.. వీటిలో స‌గం సినిమాలైనా వెన‌క్కి వెళ్లిపోవ‌డం ఖాయం. కాక‌పోతే.. ఈలోగా...ప్ర‌చారాలు, హ‌డావుడీ కాస్త క‌నిపిస్తుంది.

ALSO READ: చిరు సినిమా.. ఇంత స్పీడుగానా?