ENGLISH

నువ్వు నా మ‌నిషివి.. నేను నీ దానిని.

06 October 2020-14:30 PM

మేడ్ ఫ‌ర్ ఈజ్ అద‌ర్ అంటే... నాగ‌చైత‌న్య - స‌మంత‌నే. తెర‌పై వీరిద్ద‌రి కెమిస్ట్రీ అద్భుతంగా పండిన‌ట్టే - నిజ జీవితంలోనూ అంతే సూప‌ర్ హిట్ట‌య్యింది. ప‌రిచ‌యం స్నేహంగా మారి, స్నేహం ప్రేమ‌కు దారితీసి, ఆ ప్రేమ పెళ్లి పీట‌లెక్కి ఈరోజుతో స‌రిగ్గా మూడేళ్లు. ఈ సంద‌ర్భంగా చైతూతో క‌లిసి ఉన్న ఫొటోని ట్వీట్ చేసింది స‌మంత‌. ``నువ్వు పూర్తిగా నా మనిషివి. అలాగే నేను నీదానిని.

 

మనం ఏ ద్వారం వద్దకు వచ్చినా.. ఇద్దరం కలిసే దానిని తెరుస్తాం. వివాహ వార్షికోత్సవ శుభాకాంక్షలు హజ్బెండ్ నాగచైతన్య`` అంటూ ట్వీటింది. ఈ లాక్ డౌన్ స‌మ‌యంలో పూర్తిగా ఇంటికే ప‌రిమిత‌మైంది స‌మంత‌. కొన్ని క‌థ‌లు విన్నా, ఇంకా క‌న్‌ఫామ్ చేయ‌లేదు. మ‌రికొన్నాళ్లు స‌మంత ఇంటికే ప‌రిమితం కానున్న‌ద‌ని స‌న్నిహిత వ‌ర్గాలు చెబుతున్నాయి.

ALSO READ: పూరి 'ఇస్మార్ట్‌' స్టెప్‌