ENGLISH

అన్ని ఫ్లాపుల‌న్నా... చేతిలో ఆరు సినిమాలా?

06 January 2022-14:54 PM

ఆది సాయికుమార్‌.. ఎప్పుడో.. `ప్రేమ కావాలి`తో ఓ హిట్టు కొట్టాడు. ఆ త‌ర‌వాత‌.. హిట్టు అనే మాట‌కే మొహం వాచిపోయాడు.క‌నీసం యావ‌రేజ్‌కూడా లేదు. వ‌చ్చిన సినిమా వ‌చ్చిన‌ట్టే వెళ్లిపోతోంది. అస‌లు ఆది సాయికుమార్‌కి మార్కెట్ ఉందా? త‌న కోసం నిర్మాత‌లున్నారా? అనే అనుమానాలు. కానీ.. విచిత్రం ఏమిటంటే.. ఆది చేతిలో ఏకంగా ఆరు సినిమాలున్నాయిప్పుడు.

 

తాను న‌టించిన `అతిధి దేవో భ‌వ‌` ఈ శుక్ర‌వారం విడుద‌ల అవుతోంది. ఇది కాకుండా త‌ను ఓ అర‌డ‌జ‌ను ప్రాజెక్టులు చేశాడు. `బ్లాక్`, `తీస్ మార్ ఖాన్స్‌`, `అమ‌ర్ ఇన్ ద సిటీ చాప్ట‌ర్ 1`, `ఫ‌న్నీ కృష్ణ‌`, `సిఎస్ఐ స‌నాత‌న్‌`, `జంగిల్‌`... ఈ సినిమాల‌న్నీ చేస్తున్నాడు. ఇవి కాకుండా.. ఓ ద్విభాషా చిత్రం కూడా రూపుదిద్దుకుంటోంది. వాటితో పాటు కొన్ని వెబ్ సిరీస్‌లూ చేయ‌డానికి రెడీ అయ్యాడ‌ట‌. చూస్తుంటే రెండేళ్ల పాటు ఆది ఖాళీగా లేన‌ట్టే కనిపిస్తున్నాడు. ఇన్ని ఫ్లాపులున్నా, ఇప్ప‌క‌టికీ అవ‌కాశాలు వ‌స్తున్నాయంటే.. టాలీవుడ్ లో హీరోల‌కు ఎంత క‌రువొచ్చిందో అనిపిస్తోంది క‌దా? ఈ ఆరు సినిమాల్లో ఒక హిట్టు కొట్టినా - మ‌రో ప‌ది సినిమాలు బ్యాంకులో వేసుకోవ‌డం ఖాయం.

ALSO READ: బంగార్రాజు వ‌స్తాడు గానీ... ష‌ర‌తులు వ‌ర్తిస్తాయి