ENGLISH

అబిజీత్‌ బిగ్‌బాస్‌ కంటే ఎక్కువా?

10 October 2020-17:25 PM

అబిజీత్‌.. బిగ్‌బాస్‌ కంటే ఎక్కువన్న చర్చ సోషల్‌ మీడియాలో జరుగుతోంది. బిగ్‌బాస్‌ తెలుగు నాలుగో సీజన్‌లో ‘పీఆర్‌’ విషయంలో అబిజీత్‌ మిగతా కంటెస్టెంట్స్‌ కంటే చాలా ముందున్నాడన్నది ఓపెన్‌ సీక్రెట్‌. అబిజీత్‌ విషయంలో ఏ చిన్న మాట దొర్లినా అతని అభిమానులు సోషల్‌ మీడియాలో రచ్చ రచ్చ చేసేస్తున్నారు. అయితే, ఇప్పుడిప్పుడే అఖిల్‌ సార్థక్‌ నుంచి అబిజీత్‌కి సోషల్‌ మీడియాలోనూ టఫ్‌ ఫైట్‌ ఎదురవుతోంది.

 

అయినాసరే, ‘అబిజీత్‌, బిగ్‌బాస్‌ కంటే ఎక్కువ..’ అంటున్నారు అబిజీత్‌ అభిమానులు. ఈ సీజన్‌లో అబిజీత్‌ విన్నర్‌ అని ఇప్పటికే డిసైడ్‌ అయిపోయిందనీ, ‘అసలు సిసలు బిగ్‌బాస్‌ అబిజీత్‌’ అంటూ అతని అభిమానులు హంగామా చేయడం చాలా చాలా ఎక్కువగా కనిపిస్తోంది. అదే సమయంలో, ఈ ఓవర్‌ పబ్లిసిటీ కాస్తా బిగ్‌బాస్‌ నిర్వాహకులకీ చికాకు తెప్పిస్తోందట. గతంలో హ్యామన్స్‌ - రోబోట్స్‌ టాక్‌లో అబిజీత్‌ ‘స్మార్ట్‌ ప్లే’ పట్ల కింగ్‌ నాగ్‌ హర్షం వ్యక్తం చేయడంతో, దాన్నే ప్రతి టాస్క్‌లోనూ అబిజీత్‌ అప్లయ్‌ చేస్తున్న వైనం ఇంకా ఇబ్బందికరంగా మారుతోంది. ఈ విషయమై బిగ్‌బాస్‌కి ఫిర్యాదులు పెద్దయెత్తున వెళుతున్నాయట.

 

అయితే, ఫాలోయింగ్‌ అబిజీత్‌కి ఎక్కువ వుంది గనుక, అతన్ని ఎంటర్‌టైన్‌ చేయడం బిగ్‌బాస్‌కి తప్పనిసరి.. అన్న వాదన కూడా లేకపోలేదు. అలాగని, మొత్తం రియాల్టీ షోని మట్టికరిపించేస్తారా.? అన్న ప్రశ్న కూడా ఉత్పన్నమవుతోంది. ఈ వీకెండ్‌లో బిగ్‌ హోస్ట్‌ నాగార్జున స్పందనని బట్టి, అబిజీత్‌ విషయంలో బిగ్‌బాస్‌ స్ట్రాటజీ ఏంటన్నది కూడా తేలిపోనుంది.

ALSO READ: 'కేస్‌ 99’ ఫస్ట్‌లుక్‌ విడుదల చేసిన బోయపాటి శ్రీను!