ENGLISH

బాలయ్య విలన్ విజయ్ రంగరాజు ఇక లేరు

20 January 2025-14:03 PM

టాలీవుడ్ లో విషాదం చోటు చేసుకుంది. టాలీవుడ్ స్టార్ విలన్ విజయ్‌ రంగరాజు తుది శ్వాస విడిచారు. చెన్నైలోని ఓ ప్రైవేటు హాస్పటల్ లో ట్రీట్ మెంట్ తీసుకుంటూ ఆయన పరమ పదించారు. వారం రోజుల క్రితం ఓ సినిమా షూటింగ్‌లో గాయపడ్డారు విజయ్‌ రంగరాజు. వెంటనే చెన్నైలోని ప్రైవేటు ఆసుపత్రిలో చేర్చారు. ట్రీట్ మెంట్ లో ఉండగానే హార్ట్ స్ట్రోక్ రావటంతో ఆయన మరణించారు. రంగరాజ్ మరణంతో సినీ పరిశ్రమ తీవ్ర దిగ్బ్రాంతికి లోనయింది. రంగరాజు మృతికి పలువురు సినీ ప్రముఖులు సంతాపం తెలియజేస్తున్నారు.

విజయ రంగరాజు మహారాష్ట్రకు చెందివారు. స్పోర్ట్స్​ మెన్ గా కెరియర్ ప్రారంభించిన ఈయన తర్వాత నటన మీద ఆసక్తితో మద్రాసులోని రంగస్థల నటుడిగా నట ప్రస్థానం మొదలుపెట్టారు. విజయ రంగరాజు మలయాళంలో మోహన్ లాల్ నటించిన 'వియాత్నం కాలనీ' అనే సినిమాతో వెండి తెర ప్రయాణం మొదలుపెట్టారు. ఈ సినిమాతో వచ్చిన గుర్తింపుతో తర్వాత తమిళం, కన్నడ మళయాలం, తెలుగు సినిమాల్లో విలన్ గా నటించి మంచి పేరు తెచ్చుకున్నారు. 1994లో భైరవ ద్వీపం సినిమాతో తెలుగు ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చారు. ఇండస్ట్రీలో అప్పటికే ఉదయ్ రంగరాజు అనే యాక్టర్ ఉండటంతో తన అసలు పేరైన ఉదయ రాజ్‌కుమార్ పేరును విజయ్ రంగరాజు గా మార్చుకున్నారు.

భైరవద్వీపం మూవీ విజయ బ్యానర్​ లో వస్తున్నందున, అదే తన మొదటి తెలుగు సినిమా కావటంతో 'విజయ' అని పేరుని, భైరవ ద్వీపం లో తన పాత్ర పాతాళ భైరవిలో ఎస్​.వి.రంగారావు చేసిన పాత్రని పోలి ఉండటంతో రంగ, తన సొంత పేరులోని 'రాజు' కలిపి 'విజయ రంగ రాజు' గా పేరు మార్చుకున్నానని ఒక ఇంటర్వ్యూలో తెలిపారు. గోపీచంద్ 'యజ్ఞం' మూవీ విజయ్ రంగరాజుకి బ్రేక్ ఇచ్చింది. ఈయన వెయిట్ లిఫ్టింగ్, బాడీ బిల్డింగ్ లో నిష్ణాతుడు అని తెలుస్తోంది. రంగరాజుకి ఇద్దరు కూతుళ్లున్నారు.

ALSO READ: ఫిబ్రవరి లో తెలుగు సినిమాల జాతర