ENGLISH

అఖండ‌ని మిస్ చేసుకుంది వీళ్లే..!

08 December 2021-15:00 PM

ఈ రోజుల్లో హిట్ కొట్ట‌డం అంటే ఆషామాషీ వ్య‌వ‌హారం కాదు. చేతిలో ఓ హిట్ ఉంటే..ఆ జోరే వేరు. క‌థానాయిక‌ల‌కు హిట్ అనేది అత్య‌వ‌స‌రం. అందుకే... ప్ర‌తి సినిమానీ ఆచి తూచి ఎంచుకుంటారు. ఓ సూప‌ర్ హిట్ సినిమాలో అవ‌కాశం వ‌చ్చినా, కాద‌నుకోవ‌డం అంటే... వాళ్ల కెరీర్‌ని క‌చ్చితంగా రాంగ్ రూట్ లో న‌డుపుకున్న‌ట్టే. అలా ఓ బంప‌ర్ ఆఫ‌ర్‌ని కొంత‌మంది హీరోయిన్లు మిస్ చేసుకున్నారు.

 

ఇటీవ‌ల విడుద‌లై.. సంచ‌ల‌న విజ‌యం సాధించిన చిత్రం అఖండ‌. తొలి నాలుగు రోజుల్లోనే.. ఈ సినిమా బ్రేక్ ఈవెన్ సాధించి, 2021లోనే అతి పెద్ద విజ‌యాల్లో ఒక‌టిగా నిలిచింది. ఈ సినిమాలో కాసేపే క‌నిపించినా స‌రే, త‌న గ్లామ‌ర్ సొబ‌గుల‌తో ఆక‌ట్టుకుంది ప్ర‌గ్యా జైస్వాల్. ఈ హిట్ తో ప్ర‌గ్యా కెరీర్ కి మ‌ళ్లీ ఊపు వ‌చ్చిన‌ట్టే. అయితే నిజానికి ఈ ఆఫ‌ర్ ముందు ప్ర‌గ్యా చేతికి వెళ్ల‌లేదు. ఎంతోమంది హీరోయిన్ల చేతులు మారింది. ఈ సినిమా కోసం ముందు కాజ‌ల్ ని సంప్ర‌దించారు. తను నో చెప్పింది. ఆ త‌ర‌వాత పాయ‌ల్ రాజ్ పుత్ అనుకున్నారు. త‌నూ... హ్యాండిచ్చింది. కేథ‌రిన్‌, ర‌కుల్ ప్రీత్ సింగ్... ఇలా చాలామంది కి బోయ‌పాటి క‌థ చెప్పాడు.కానీ... వాళ్లు ఈ సినిమా చేయ‌డానికి ముందుకు రాలేదు. అందుకు ర‌క‌ర‌కాల కార‌ణాలు. అలా చివ‌రికి ఈ ఆఫ‌ర్‌.. ప్ర‌గ్యా ద‌గ్గ‌ర‌కు వెళ్లింది. త‌ను ఒప్పుకుంది. ఇప్పుడు ఓ హిట్ ని త‌న ఖాతాలో వేసుకుంది. పాపం.. అఖండ‌కు ఇంత రేంజ్ ఉంటుంద‌ని తెలీక‌, ఆ హీరోయిన్లంతా ఓ హిట్ ని జార‌విడ‌చుకున్నారు.

ALSO READ: యాక్సిడెంట్ చేసి అడ్డంగా బుక్ అయిన బుల్లి తెర స్టార్‌