ENGLISH

తేజూ సినిమా హీరోయిన్ మారిపోయింది

08 October 2020-15:00 PM

సాయిధ‌ర‌మ్ తేజ్ ఫుల్ స్వింగ్ లో ఉన్నాడు. `సోలో బ్ర‌తుకే సో బెట‌రు` సినిమా ఇంకా విడుద‌ల కాక‌ముందే... ఇప్పుడు దేవాక‌ట్టా సినిమాని సెట్స్‌పైకి తీసుకెళ్లే ప్ర‌య‌త్నాల్లో ఉన్నాడు. ఈనెల‌లోనే దేవాక‌ట్టా సినిమా ప్రారంభం కాబోతోంద‌ని స‌మాచారం. అయితే ఈలోగా చిత్ర‌బృందంలో కీల‌క‌మైన మార్పు చోటు చేసుకుంది. సాయి ధ‌ర‌మ్ తేజ్ ప‌క్క‌న నివేదా పేతురేజ్ ని క‌థానాయిక‌గా ఎంచుకున్నారు. అయితే ఇప్పుడు నివేదా ఈ టీమ్ నుంచి త‌ప్పుకుంద‌ని స‌మాచారం. నివేదా పేతురేజ్ స్థానంలో ఐశ్వ‌ర్య రాజేష్ ని క‌థానాయిక‌గా ఎంచుకున్నార‌ని తెలుస్తోంది.

 

ఈ విష‌య‌మై రెండు మూడు రోజుల్లో అధికారిక ప్ర‌క‌ట‌న రానుంది. `శైల‌జ కృష్ణ‌మూర్తి`, `వ‌ర‌ల్డ్ ఫేమ‌స్ ల‌వ‌ర్‌` చిత్రాల‌తో ఆక‌ట్టుకుంది ఐశ్వ‌ర్యా రాజేష్‌. `వ‌రల్డ్ ఫేమ‌స్ ల‌వ‌ర్‌` లో ముగ్గురు హీరోయిన్లు ఉన్నా - ఎక్కు వ మార్కులు ఐశ్వ‌ర్య‌కే ద‌క్కాయి. దేవాక‌ట్టా సినిమాలో హీరోయిన్ పాత్ర‌కు ఎక్కువ ప్రాధాన్యం ఉండ‌డంతో.. నివేదా స్థానంలో, ఐశ్వ‌ర్య రాజేష్‌ని ఎంచుకున్నార‌ని తెలుస్తోంది. అయితే ఇది నిజ‌మా, కాదా? అనేది తెలియాలంటే ఇంకొన్ని రోజులు ఆగాలి.

ALSO READ: బిగ్‌బాస్‌లో పవన్‌ కళ్యాణ్‌ ఫ్యాన్స్‌!