ENGLISH

'నా వల్ల కాదే..' అంటోన్న ఆకాష్‌ పూరీ.!

23 January 2020-15:00 PM

డేరింగ్‌ డైరెక్టర్‌ పూరీ జగన్నాధ్‌ తనయుడు ఆకాష్‌ పూరీ హీరోగా తెరకెక్కుతోన్న చిత్రం 'రొమాంటిక్‌'. షూటింగ్‌ దశలో ఉన్న ఈ చిత్రం నుండి ఇటీవల ఓ రొమాంటిక్‌ సాంగ్‌ విడుదలైన సంగతి తెలిసిందే. పూరీ స్వ హస్తాలతో లిరిక్స్‌ అందించిన ఈ సాంగ్‌ విజువల్స్‌ కుర్రకారును పిచ్చెక్కించేశాయి. బీచ్‌ నేపథ్యంలో సాగే ఈ పాటలోని హీరో, హీరోయిన్‌ శృతి మించిన శృంగార సన్నివేశాలు యూత్‌ని గిలిగింతలు పెట్టించాయి. ఇక ఇప్పుడు మరో సాంగ్‌ రాబోతోంది. 'నా వల్ల కాదే..' అంటూ సాగే ఈ సాంగ్‌ని రేపు అనగా జనవరి 24న రిలీజ్‌ చేయనున్నారు.

 

ఈ సందర్భంగా రిలీజ్‌ చేసిన పోస్టర్‌ కూడా బీచ్‌ బ్యాక్‌ గ్రౌండ్‌లోనే కనిపిస్తోంది. బీచ్‌ ఒడ్డున రాళ్లపై హీరో, హీరోయిన్స్‌ ఒకరి వెనక మరొకరు దూర దూరంగా కూర్చొని ఏదో బాధగా కనిపిస్తున్నారు. విరహ వేదన అయ్యుంటుంది బహుశా. 'ప్రేమ ఉన్న చోటే పెయిన్‌ ఉంటుంది..' అనే క్యాప్షన్‌ని సుస్పష్టంగా ప్రతిబింబిస్తోంది ఈ పోస్టర్‌. ఆ పెయిన్‌ని తట్టుకోలేక ఓ ఫుల్‌ బాటిల్‌ లాగించేస్తున్నాడు హీరో. హీరోయిన్‌ మాత్రం ఏం చేయాలో తోచక, ఆ పెయిన్‌ని అనుభవిస్తున్నట్లుగా కనిపిస్తోంది. అసలు వీరిద్దరి ప్రేమ ఏంటో, పెయిన్‌ ఏంటో తెలియాలంటే 'రొమాంటిక్‌' నుండి 'నా వల్ల కాదే..' అనే ఆ లిరికల్‌ సాంగ్‌ ఏదో వచ్చే వరకూ ఆగాల్సిందే. భాస్కర్‌ భట్ల రచించిన ఈ లిరికల్‌ సాంగ్‌ రేపు సాయంత్రం 5 గంటలకు రిలీజ్‌ కానుంది.

ALSO READ: అస్వ‌స్థ‌త‌కు గురైన‌ సునీల్‌