ENGLISH

నాలుగో రోజూ దుమ్ము రేపిన అఖండ‌

06 December 2021-11:00 AM

బాల‌కృష్ణ `అఖండ‌` బాక్సాఫీసు ద‌గ్గ‌ర దుమ్ము రేపుతోంది. గురువారం విడుద‌లైన ఈ చిత్రం.. శుక్ర‌, శ‌ని, ఆదివారాలు కూడా అదిరిపోయే వ‌సూళ్లు సాధించింది. లాంగ్ వీకెండ్ ని బాగా ఉప‌యోగించుకుంది. తొలి 4 రోజుల్లో ఏపీ, తెలంగాణ క‌లిపి రూ.36.5 కోట్లు వ‌సూలు చేసింది. బోయ‌పాటి శ్రీ‌ను ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఈ చిత్రంలో శ్రీ‌కాంత్ విల‌న్ గా న‌టించిన సంగ‌తి తెలిసిందే. ప్ర‌గ్యా జైస్వాల్ క‌థానాయిక.యాక్ష‌న్ ఘ‌ట్టాలు, అఖండ‌గా.. బాల‌కృష్ణ సింహ గ‌ర్జ‌న ఈ సినిమాకి ప్ల‌స్ పాయింట్స్ గా మారాయి. పుష్ఫ వ‌చ్చేంత వ‌ర‌కూ అఖండ విశ్వ‌రూపం ఇలానే కొన‌సాగే అవ‌కాశాలు పుష్క‌లంగా ఉన్నాయి. అఖండ 4 రోజుల వ‌సూళ్లు నైజాం: రూ.12 కోట్లు సీడెడ్‌: రూ.8.8 కోట్లు ఉత్త‌రాంధ్ర : రూ.3.77 కోట్లు గుంటూరు : రూ.3.24 కోట్లు వెస్ట్: రూ. 2.04 కోట్లు కృష్ణ : 2.26 కోట్లు నెల్లూరు: 1.76 కోట్లు మొత్తం: 36.41 కోట్లు

ALSO READ: అల్లు అర్జున్ అడవి తల్లి మాట!