ENGLISH

బిగ్ బాస్ హౌస్ నుంచి ఈవారం ప్రియాంక బ‌య‌ట‌కు

06 December 2021-10:22 AM

బిగ్ బాస్ హౌస్ నుంచి ఈవారం ప్రియాంక బ‌య‌ట‌కు వచ్చేసింది. ట్రాన్స్ జెండ‌ర్ గా అడుగుపెట్టిన పింకీ అనే ఈ ప్రియాంక‌.. తొలి వారం నుంచీ సేఫ్ గేమ్ ఆడింది. ఎవ‌రితోనూ గొడ‌వ‌లు పెట్టుకోలేదు, ఎగ‌స్ట్రాలు చేయ‌లేదు. స‌ర‌దాగా ఉంటూ... అంద‌రితోనూ మంచి మార్కులు వేయించుకుంది. పింకీ ఈ సీజ‌న్ చివ‌రి వ‌ర‌కూ ఉంటుంద‌ని అంతా భావించారు. అయితే 13వ వారంలో బ‌య‌ట‌కు రావ‌ల్సివ‌చ్చింది. ఇది వ‌ర‌కు కూడా బిగ్ బాస్ హౌస్ లో ట్రాన్స్ జెండ‌ర్లు ప్ర‌వేశించారు. కానీ ఎవ‌రికీ పింకీ అంత‌టి ఆద‌ర‌ణ రాలేదు. ఇంత‌కాలం.. హౌస్ లో ఉన్న ట్రాన్స్ జెండ‌ర్ కూడా త‌నే.

 

13వ వారంలో బ‌య‌ట‌కు వ‌చ్చినా, పింకీ బాధ ప‌డాల్సిందేం లేదు. ఈ 13 వారాల‌కు గానూ దాదాపు రూ.30 ల‌క్ష‌లు సంపాదించింద‌ని స‌మాచారం. ఇది మంచి మొత్త‌మే. త‌న కోసం సినిమా ఛాన్సులు కూడా ఎదురు చూస్తున్నాయ‌న్న‌ది ఇండ్ర‌స్ట్రీ వ‌ర్గాల మాట‌. ఒక‌ట్రెండు సినిమాలు చేతిలో ప‌డి, క్లిక్క‌యితే... పింకీ లైఫ్ సెటిల్ అయిపోయిన‌ట్టే.

ALSO READ: అల్లు అర్జున్ అడవి తల్లి మాట!