ENGLISH

ట్రైలర్‌ టాక్‌: 'పులొచ్చింది మేక సచ్చింది'.!

07 January 2020-10:30 AM

'బొమ్మ దద్దరిల్లిపోద్ది.. అంటూ మహేష్‌బాబు 'సరిలేరు..' ట్రైలర్‌ ఖుషీ ఇంకా అలా ఉండగానే, అల్లు అర్జున్‌ 'అల వైకుంఠపురములో..' అంటూ తనదైన స్టైల్‌లో ట్రైలర్‌ని దించేశాడు. త్రివిక్రమ్‌ స్టైల్‌ మేకింగ్‌, పంచ్‌ డైలాగ్స్‌ ట్రైలర్‌లో అచ్చు గుద్దినట్లు చూపించారు. దాదాపు అన్ని క్యారెక్టర్స్‌ పరిచయం ట్రైలర్‌లో జరిగింది. పూజా హెగ్దే అందాలు, అడుగడుగునా అల్లు అర్జున్‌ స్టైలిష్‌ మ్యానరిజమ్‌ అదిరిపోయింది. ఇక త్రివిక్రమ్‌ మార్క్‌ డైలాగ్స్‌ అయితే ఫ్యాన్స్‌ని ఉర్రూతలూగించేస్తున్నాయి. 'పులొచ్చింది మేక సచ్చింది..' అనే సిట్యువేషనల్‌ డైలాగ్‌తో పాటు, ఆడవాళ్ల కోసం త్రివిక్రమ్‌ రాసిన డైలాగ్‌ మంచి మార్కులు కొట్టేస్తోంది.

'దేన్నైనా పుట్టించే శక్తి ఇద్దరికే ఉంది సార్‌.. ఒకటి నేలకు.. రెండు వీళ్లకు..' అంటూ పూజా హెగ్దేని చూపిస్తూ బన్నీ చెప్పే డైలాగ్‌తో లేడీ ఫ్యాన్స్‌ని బుట్టలో వేసేశాడు బన్నీ. ఇలాంటి డైలాగ్స్‌ ఒక్కటేమిటి బొచ్చెడున్నాయి. టోటల్‌గా ట్రైలర్‌ని చాలా కూల్‌ అండ్‌ లవ్లీగా తెరకెక్కించారు. అన్ని కమర్షియల్‌ ఎలిమెంట్స్‌ మిక్స్‌ చేశారు. క్లాస్‌, మాస్‌ టచ్‌తో పాటు, యాక్షన్‌, కామెడీ, పంచ్‌ పటాకా.. ఇలా చెప్పుకుంటూ పోతే, హండ్రెడ్‌ పర్సంట్‌ మార్కులు కొట్టేలా ఉంది ట్రైలర్‌. ఇక తమన్‌ అద్భుతమైన బ్యాక్‌ గ్రౌండ్‌ మ్యూజిక్‌ ట్రైలర్‌కే హైలెట్‌గా నిలుస్తోంది. 'లలలలలాలా.. అల వైకుంఠపురములో..' అనే బ్యాక్‌ గ్రౌండ్‌ వెంటాడేస్తోంది. సినిమాటోగ్రఫీ అదిరిపోయేలా ఉంది. జనవరి 12న ప్రేక్షకుల ముందుకు రానుంది.

ALSO READ: మా నాన్న‌కి ప‌ద్మ‌శ్రీ ఇవ్వాలి: బ‌న్నీ కోరిక‌.