ENGLISH

పాన్ ఇండియా ప్రాజెక్ట్ లో బన్నీ వారసురాలు

15 April 2024-17:57 PM

అల్లు అర్హ పేరు తెలియని వారు లేరు. 'పిట్ట కొంచెం కూత ఘనం' అన్నట్టు ఉంది అల్లు అర్హ క్రేజ్. ఈ చిచ్చర పిడుగుకి సోషల్ మీడియాలో విపరీతంగా ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. అర్హ, బన్నీ చేసిన అల్లరి, అన్నతో కలిసి అర్హ చేసిన  సందడి ఎప్పటికప్పుడు బన్నీ భార్య స్నేహ పోస్ట్ చేస్తూ ఉంటుంది. ఇవి క్షణాల్లో వైరలవుతూ ఉంటాయి. బన్నీ కూడా ఏ మాత్రం తీరిక దొరికినా కూతురితో అల్లరి చేస్తూ, వాటిని ఫాన్స్ తో షేర్ చేసుకుంటాడు. అల్లు అర్హ ఇప్పటికే గుణశేఖర్ దర్శకత్వం లో వచ్చిన శాకుంతలం సినిమాలో భరతుడిగా నటించి మెప్పించింది. మళ్ళీ ఇన్నాళ్ళకి మోస్ట్ అవైటెడ్  పాన్ ఇండియా మూవీలో ఆఫర్ అందుకుంది. 


అల్లు కుటుంబంలో  నాలుగో తరానికి చెందిన అర్హ, బన్నీ వారసురాలిగా ఎంట్రీ ఇచ్చి , ఇంత చిన్న వయసులోనే తండ్రిని మించి క్రేజ్ తెచ్చుకుని, బన్నీతో సమానంగా పాన్ ఇండియా ప్రాజెక్ట్ లోకి అడుగుపెడుతోంది. ఎన్టీఆర్, కొరటాల శివ కాంబోలో తెరకెక్కుతున్న పాన్ ఇండియా సినిమా దేవరలో అర్హ నటిస్తున్నట్లు సమాచారం. జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాలో జాన్వీ చిన్నప్పటి పాత్రలో అర్హ నటించనున్నట్లు తెలుస్తోంది. దీనితో బన్నీ ఫాన్స్, మెగా ఫాన్స్ ఆనందానికి అవధులు లేవు. ఇప్పటికే రామ్ చరణ్, ఎన్టీఆర్ కలిసి RRR లో నటించారు. ఇప్పుడు బన్నీ కూతురు అర్హ, ఎన్టీఆర్  దేవర లో నటిస్తుండటంతో వీరి ఫాన్స్ సంబరాలు చేసుకుంటున్నారు.  


దేవర సినిమాతో అర్హ పాన్ ఇండియా వెలుగొందాలని అంతా ఆశీర్వదిస్తున్నారు. రెండు భాగాలుగా తెరకెక్కుతున్న దేవర మూవీ మొదటి పార్ట్ త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. జాన్వీ  కపూర్ కి ఇదే మొదటి సౌత్ సినిమా కావటం విశేషం.