అల వైకుంఠపురములో విజయంతో ధూమ్ ధామ్ చేస్తోంది అల్లు కుటుంబం. అయితే ఇంతలోనే ఓ విషాదం ఆ కుటుంబాన్ని చుట్టుముట్టింది. అల్లు అర్జున్ మేనమామ ముత్తంశెట్టి రాజేంద్రప్రసాద్ బుధవారం రాత్రి విజయవాడలో గుండెపోటుతో మరణించారు. మేమమామతో బన్నీకి అనుబంధం ఎక్కువ. సుకుమార్ దర్శత్వంలో రూపుదిద్దుకుంటున్న చిత్రానికి సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారాయన.
రాజేంద్ర ప్రసాద్ అకాల మరణంతో అల్లు కుటుంబం షాక్‌కి గురైంది. వెంటనే విజయవాడ చేరుకుని అంతిమ సంస్కారాల ఏర్పాట్లలో తలమునకలైంది. అల వైకుంఠపురం విజయోత్సవాల్ని అల్లు అర్జున్ ఘనంగా జరపాలని ఫిక్సయ్యాడు. ఇప్పటికే విశాఖపట్నంలో ఓ వేడుక నిర్వహించారు. వరంగల్లోనూ సక్సెస్ మీట్ పెట్టాలని భావించారు. అయితే మేనమామ మరణంతో సక్సెస్‌మీట్ వాయిదా పడే అవకాశాలున్నాయి.
ALSO READ: ప్రభాస్ కోసం... ప్రేమ పావురం