ENGLISH

సెక్స్‌ రాకెట్‌: ఆమెకంత టెన్షన్‌ ఎందుకు?

21 June 2018-18:12 PM

అమెరికాలోని చికాగోలో వెలుగు చూసిన సెక్స్‌ రాకెట్‌కి సంబంధించి రోజుకో సంచలన విషయం వెలుగు చూస్తోంది. ఓ ప్రముఖ హీరోయిన్‌, ఓ ప్రముఖ యాంకర్‌, ఇంకొందరు నటీమణులు ఈ సెక్స్‌ రాకెట్‌లో బాధితులుగా పేర్కొనబడ్డారు. 

వారి పేర్లు ఇంతవరకూ అధికారికంగా బయట పడలేదు. ఇలాంటి కేసుల్లో మహిళల్ని బాధితులుగానే చూడడం తెలిసిన సంగతే. అయితే పట్టుబడ్డ నిందితుడు కిషన్‌ ఆయన భార్య చంద్రకళతో పాటు, రాకెట్‌ సూత్రధారులుగా సినీ పరిశ్రమలో ఇంకెవరైనా ఉన్నారా? బాధితులే ఇంకొకర్ని బాధితులుగా మార్చి నిందితులయ్యారా? అనే విషయాన్ని అమెరికా పోలీసులు విచారిస్తున్నారు. 

ఇంకో పక్క ఓ యాంకర్‌, ఓ హీరోయిన్‌ అమెరికా పేరు చెబితేనే హడలిపోతున్నారంటూ సినీ పరిశ్రమలో గాసిప్స్‌ వినిపిస్తున్నాయి. అందుకు కారణం సెక్స్‌ రాకెట్‌ నడిచిన కాలంలో వారు అమెరికాకి వెళ్లి రావడమేనట. ఆ ఘటనతో సంబంధం లేకపోయినా, అమెరికా వెళ్లడం, అదీ ఆ టైంలో వెళ్లడం వంటివి వీరికి ఇబ్బందికరంగా మారాయి. 

ఐదుగుర్ని ఈ కేసులో విక్టిమ్స్‌గా పేర్కొన్నారంటే వారిపై చట్టపరమైన చర్చలేమీ ఉండవు. వారి నుండి సమాచారమ్‌ మాత్రమే సేకరిస్తారు. కానీ ఇక్కడ ఈ అంశంపై జరుగుతున్న రచ్చ కారణంగా సంబంధం లేని వారు కూడా ఆందోళన చెందక తప్పడం లేదు.

ALSO READ: బిగ్ బాస్ TRPలు పడిపోయాయట