ENGLISH

బూతు వేరు కోరిక వేరు - కైరా అద్వానీ

21 June 2018-18:08 PM

నెట్‌ ఫ్లిక్స్‌ ద్వారా ఇంటర్నెట్‌లో సంచలనం సృష్టించేస్తోంది 'లస్ట్‌ స్టోరీస్‌'. ఇందులోనూ 'భరత్‌ అనే నేను' ఫేం కైరా అద్వానీ ఎపిసోడ్‌ సంచలనంగా మారింది. ఇప్పుడు ఎక్కడ విన్నా కైరా అద్వానీ గురించే చర్చ జరుగుతోంది. అంత పచ్చిగా బూతు సన్నివేశంలో కైరా అద్వానీ ఎలా నటించిందనీ ఆశ్చర్యపోతున్నారంతా. 

అయితే రకుల్‌ ప్రీత్‌సింగ్‌ లాంటి వాళ్లు కైరా అద్వానీ పర్‌ఫామెన్స్‌కి ఫిదా అయిపోతున్నారు. ఆమెను ప్రశంసలతో ముంచెత్తుతున్నారు. కోరికలతో రగిలిపోయే ఓ మహిళ ఆ కోరికలను చల్లార్చుకునేందుకు వైబ్రేటర్‌ను వాడడం ఈ క్రమంలో ఆమె ఇబ్బందికర పరిస్థితుల్లోకి వెళ్లడం.. అనే సీన్‌ ఇంటర్నెట్‌లో చక్కర్లు కొట్టేస్తోంది. ఆమె ఎందుకిలా చేస్తోంది.? అనే విషయం చాలా మందికి తొలుత అర్ధం కావడం లేదు. తర్వాత విషయం తెలుసుకుని ముక్కున వేలేసుకుంటున్నారు. జుగుప్సాకరమనాలా? లైట్‌ తీస్కోవాలా అర్ధం కాని పరిస్థితి. 

ఈ సీన్‌ గురించి, తన గురించి వస్తున్న విమర్శలపై కైరా అద్వానీ స్పందించింది. దర్శకుడు ఆ పాత్ర తీరు తెన్నుల్ని అలా రూపొందించాడు. ఆ పాత్రలో చేయాలని ఒప్పుకున్నాక పాత్రకి పూర్తి న్యాయం చేయాలి. ఆ సీన్‌లో వల్గారిటీ ఏమీ లేదు. కనీసం ఎక్స్‌పోజింగ్‌ కూడా లేదు. బూతు వేరు, కోరిక వేరు. మహిళలకు సంబంధించి, అతి సున్నితమైన విషయాన్ని 'లస్ట్‌ స్టోరీస్‌'లో చూపించారు.. అని కైరా అద్వానీ చెప్పింది. 

కైరా చెప్పింది కూడా నిజమే.

ALSO READ: బిగ్ బాస్ TRPలు పడిపోయాయట