ENGLISH

'కొక్కొరొకో' అంటున్న మెగాస్టార్‌ అల్లుడు

21 June 2018-16:58 PM

అప్పుడెప్పుడో 'మాస్టర్‌' సినిమాలో మెగాస్టార్‌ చిరంజీవి 'ఈ చాయ్‌ చమక్కులే చూడరా బాయ్‌..' అంటూ టీ సాంగ్‌ పాడాడు. అంతకన్నా ముందు 'ఎగిరే పావురమా' సినిమాలో ఎస్వీ కృష్ణారెడ్డి 'ఆహా ఏమి రుచి అనరా మైమరచి తాజా కూరలలో రాజా ఎవరంటే ఇంకా చెప్పాలా వంకాయేనండీ..' అంటూ వంకాయ మీద సాంగ్‌ పాడించాడు. ఈ రెండు సాంగ్స్‌ సూపర్‌ డూపర్‌ హిట్‌ సాంగ్స్‌. ఇప్పుడు మెగాస్టార్‌ అల్లుడు కళ్యాణ్‌దేవ్‌ 'చికెన్‌' సాంగ్‌ అంటూ వస్తున్నాడు. 

చిరంజీవి చిన్నల్లుడు కళ్యాణ్‌దేవ్‌ హీరోగా తెరకెక్కుతోన్న చిత్రం 'విజేత'. ఈ సినిమా నుండి 'కొక్కొరొకో..' అంటూ సాగే ఫస్ట్‌ ఆడియో సింగిల్‌ని రేపు అనగా జూన్‌ 22న రిలీజ్‌ చేయనున్నారు. ఈ సందర్భంగా విడుదల చేసిన పోస్టర్‌కి మంచి రెస్పాన్స్‌ వస్తోంది. కోడికి సంతాపం అంటూ పోస్టర్‌ నిండా వేలాడదీసిన చికెన్‌.. కళ్యాణ్‌దేవ్‌ ఎక్స్‌ప్రెషన్‌ చాలా బాగున్నాయి. త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుందీ చిత్రం. ఈ లోగా ఆడియో సింగిల్స్‌ పండగ మొదలైందన్న మాట. తొలి ఆడియో సింగిల్‌గా చికెన్‌ సాంగ్‌ని రిలీజ్‌ చేస్తూ, సినిమాపై స్పెషల్‌ ఇంట్రెస్ట్‌ క్రియేట్‌ చేస్తున్నారు. వారాహి చలన చిత్ర బ్యానర్‌లో సాయి కొర్రపాటి ఈ చిత్రాన్ని ప్రతిష్ఠాత్మకంగా నిర్మిస్తున్నారు. కొత్త డైరెక్టర్‌ రాకేష్‌ శశి దర్శకత్వం వహిస్తున్నాడు. 'కళ్యాణవైభోగమే' ఫేం మాళవిరా శర్మ కళ్యాణ్‌దేవ్‌కి జోడీగా నటిస్తోంది. 'బాహుబలి' వంటి ప్రతిష్ఠాత్మక చిత్రానికి కెమెరామేన్‌గా పని చేసిన సెంథిల్‌ కుమార్‌ ఈ సినిమాకి పని చేస్తుండడం విశేషం. మరోవైపు తొలి సినిమా విడుదల కాకుండానే కళ్యాణ్‌దేవ్‌ మరో సినిమాకీ గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చేశాడు. ఆ సినిమాకి సంబంధించి పూర్తి వివరాలు ఇంకా తెలీదు కానీ, 'వరప్రసాద్‌గారి అల్లుడు' అనే టైటిల్‌ని ఈ చిత్రానికి పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది.

ALSO READ: బిగ్ బాస్ TRPలు పడిపోయాయట