ENGLISH

ఇప్పట్లో తల్లిని కానంటోన్న ముద్దుగుమ్మ.!

21 June 2018-16:44 PM

ఒకప్పుడు హీరోయిన్లు పెళ్లి చేసుకున్నారంటే, ఇక కెరీర్‌కి టాటా బైబై చెప్పేసినట్లే. కానీ ఇప్పుడు పరిస్థితి మారింది. పెళ్లి తర్వాత కూడా అందాల భామలు తమలో గ్లామర్‌ ఏమాత్రం తగ్గించుకోకుండా,  గతంలో మాదిరిగానే అవకాశాలు చేజిక్కించుకుంటున్నారు. కొత్త భామలకు గట్టి పోటీ ఇస్తున్నారు. 

తెలుగులో సమంత, తమిళంలో అమలాపాల్‌, హిందీలో అనుష్కా శర్మ తదితరులు ఇలా చెప్పుకుంటూ పోతే ఈ మధ్య పెళ్లి చేసుకుని కెరీర్‌లో బిజీగా ఉన్న ముద్దుగుమ్మల లిస్టు పెద్దదే అని చెప్పాల్. ఇకపోతే తాజాగా పెళ్లి చేసుకున్న శ్రియ విషయానికి వస్తే, 'ఇష్టం' సినిమాతో తెలుగు తెరకు పరిచయమై, తెలుగుతో పాటు, తమిళ, హిందీ చిత్రాల్లో కూడా నటించి, 35 ఏళ్ల వయసులోనూ తరగని అందంతో దూసుకెళ్తోంది. సీనియర్‌ హీరోస్‌తోనే కాకుండా, యంగ్‌ హీరోస్‌ సరసన కూడా నటించి గ్లామర్‌ డాళ్‌గా సత్తా చాటుతోంది. 

తాజాగా తెలుగులో శ్రియ నటించబోతున్న చిత్రం ఇటీవల లేటెస్టుగా స్టార్ట్‌ అయిన సంగతి తెలిసిందే. శ్రియ ప్రధాన పాత్రలో తెరకెక్కుతోన్న ఈ సినిమాతో ఓ లేడీ డైరెక్టర్‌ తెలుగు తెరకు పరిచయమవుతోంది. మెగా డాటర్‌ నిహారిక ఈ సినిమాలో కీలక పాత్ర పోషిస్తోంది. 

కాగా శ్రియ విషయానికి వస్తే, పిల్లల కోసం శ్రియని అడిగితే, మరో 20 సినిమాల వరకూ పిల్లల ప్లానింగ్‌ లేదనీ శ్రియ చెప్పింది. అంటే శ్రియ చేతిలో వరుస ప్రాజెక్టులు చర్చల దశలో ఉన్నాయనీ తెలుస్తోంది. ఇంతవరకూ శ్రియ కెరీర్‌కి బ్రేకన్నది లేదు. ఇకపై కూడా ఇప్పుడప్పుడే బ్రేక్‌ లేదనడానికి పిల్లల విషయంలో శ్రియ చెప్పిన తాజా సమాధానమే నిదర్శనం అనుకోవాలి.

ALSO READ: పవన్ కళ్యాణ్ కంటికి శస్త్రచికిత్స