ENGLISH

కత్తిలాంటి ఫిగర్‌ 'గురు'.!

21 June 2018-16:34 PM

ఈ పిక్‌ చూస్తే అలా అనకుండా ఉండలేం మరి. ఆ ముద్దుగుమ్మ ఫిగర్‌ అలాంటిది. స్పోర్ట్స్‌ బాడీ. స్వతహాగా బాక్సర్‌ కదా. అందుకే ఫిట్‌నెస్‌లో పర్‌ఫెక్ట్‌ ఫిట్‌. ఇంతకీ ఈ ముద్దుగుమ్మని గుర్తు పట్టారా? వెంకటేష్‌ ప్రధాన పాత్రలో తెరకెక్కిన 'గురు' చిత్రంలో నటించిన ముద్దుగుమ్మ రితికా సింగ్‌. ఈ మధ్య ఈ భామ సోషల్‌ మీడియాలో చేస్తున్న హడావిడి కాస్త ఎక్కువగానే ఉందండోయ్‌. తొలి సినిమా 'గురు'లో గ్లామర్‌ చూపించే అవకాశం రాలేదీ భామకి. పూర్తిగా పర్‌ఫామెన్స్‌ ఓరియెంటెడ్‌ పాత్రనే పోషించింది. అందుకే తన లోని ఫిట్‌నెస్‌తో పాటు హాట్‌నెస్‌ని కూడా ఇలా ప్రదర్శనకు పెడుతోంది. అంతేకాదండోయ్‌ ఈ బ్యూటీ ఆఫర్లు కూడా బాగానే దక్కించుకుంటోంది. ప్రస్తుతం ఆది పినిశెట్టితో 'నీవెవరో' చిత్రంలో నటిస్తోంది. మెగా కాంపౌండ్‌ హీరో సాయిధరమ్‌ తేజ్‌తో మరో సినిమాకి రితికా సింగ్‌ కమిట్‌ అయినట్లు తెలుస్తోంది. ఈ బ్లాక్‌ అండ్‌ బ్లాక్‌ కాస్ట్యూమ్‌లో రితికా హాట్‌ స్టైల్‌ సూపర్బ్‌ కదా.!
 

ALSO READ: Qlik Here For The Gallery Of Ritika Singh