ENGLISH

'హ్యాపీ వెడ్డింగ్‌'కి ముహూర్తం కుదిరిందండోయ్‌

21 June 2018-16:27 PM

మెగా డాటర్‌ నిహారిక - యంగ్‌ హీరో సుమంత్‌ అశ్విన్‌ జంటగా తెరకెక్కుతోన్న చిత్రం 'హ్యాపీ వెడ్డింగ్‌'. లక్ష్మణ్‌ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ చిత్రాన్ని ప్రముఖ నిర్మాణ సంస్థ యూవీ క్రియేషన్స్‌ నిర్మిస్తోంది. కాగా తాజాగా ఈ చిత్రం టీజర్‌ విడుదలైంది. 

'ఆకూ వక్కా మార్చుకునే టైం వచ్చేసిందండీ.. ముహూర్తం మీరు పెట్టిస్తారా? మమ్మల్ని పెట్టించమంటారా..?' అంటూ పెళ్లికొడుకు, పెళ్లి కూతుళ్ల తండ్రులు ఫోన్‌లో మాట్లాడుకోవడంతో టీజర్‌ స్టార్ట్‌ అవుతోంది. బ్యాక్‌ గ్రౌండ్‌లో పెళ్లి బాజాలు మ్యూజిక్‌ రన్‌ అవుతుంది. తమన్‌ మ్యూజిక్‌ అందించిన ఈ బ్యాక్‌ గ్రౌండ్‌ మ్యూజిక్‌ ఆకట్టుకుంటోంది. టైటిల్‌కి తగ్గట్లుగానే సినిమా సందడి సందడిగా, హ్యాపీ హ్యాపీగా, కొంచెం ఎమోషన్స్‌, చాలా ఎక్కువ ఎంటర్‌టైన్‌మెంట్‌తో ఆధ్యంతం సరదాగా సాగిపోనుంది. 

హీరో, హీరోయిన్ల మధ్య సాగే సన్నివేశాలు యూత్‌ని గిలిగింతలు పెట్టడంతో పాటు, పెద్దవారినీ ఆకట్టుకునేలా ఉంటాయట. స్క్రీన్‌ నిండా ఆర్టిస్టులతో సందడి, ఎంతో ఆహ్లాదమైన ఫీలింగ్‌ ఇస్తుందట. నిహారిక, సుమంత్‌ అశ్విన్‌ జంట చూడచక్కగా ఆకట్టుకుంటోంది. పెళ్లి కుదిరి రోజు నుండీ, పెళ్లి జరిగే రోజు వరకూ జరిగిన సన్నివేశాన్ని చిత్రీకరించిన వైనం, ఈ జనరేషన్‌నే కాదు, గత జనరేషన్‌నీ ఎంతో చక్కగా ఆకట్టుకునేలా ఉంటుందట. టీజర్‌కి మంచి రెస్పాన్స్‌ వస్తోంది. 

జూన్‌ 30న ధియేట్రికల్‌ ట్రైలర్‌ని విడుదల చేయనున్నారు. అతి త్వరలోనే సినిమాని విడుదల చేసేందుకు చిత్ర యూనిట్‌ సన్నాహాలు చేస్తోంది.

ALSO READ: Happy Wedding Teaser