ENGLISH

చిరుకి గురి పెట్టిన అనిల్ రావిపూడి.

08 January 2020-16:38 PM

వ‌రుస‌గా నాలుగు సూప‌ర్ డూప‌ర్ హిట్లు కొట్టాడు అనిల్ రావిపూడి. అందుకే సూప‌ర్ స్టార్ మ‌హేష్‌బాబు దృష్టి అత‌నిపై ప‌డింది. ఓ సూప‌ర్ స్టార్‌తో 5 నెల‌ల్లో సినిమా పూర్తి చేసి కొత్త షాక్ ఇచ్చాడు అనిల్‌. ఈ సినిమా కూడా హిట్ట‌యిపోతే అనిల్ రావిపూడి ద‌శ తిరిగిన‌ట్టే. త‌దుప‌రి సినిమా కూడా ఓ పెద్ద స్టార్‌తోనే చేయాల‌ని క‌ల‌లు కంటున్నాడు.

 

ఈసారి ఏకంగా మెగాస్టార్‌కే గురి పెట్టాడు. త‌దుప‌రి ఏయే హీరోల‌తో ప‌నిచేయాల‌ని వుంది? అని అడిగితే `చిరంజీవి ` పేరు చెప్పాడు. చిరంజీవి అంటే త‌న‌కు చాలా ఇష్ట‌మ‌ని, ఆయ‌న ఓ అవ‌కాశం ఇస్తే నిరూపించుకుంటాన‌ని, మూడు నెల‌ల్లో స్క్రిప్టు పూర్తి చేసి ఇవ్వ‌గ‌ల‌న‌ని, చిరంజీవి కోసం కొన్ని క‌థ‌లు కూడా త‌న ద‌గ్గ‌ర ఉన్నాయ‌ని చెప్పుకొచ్చాడు అనిల్‌. స‌రిలేరు నీకెవ్వ‌రు హిట్ట‌యితే.. త‌ప్ప‌కుండా చిరు నుంచి పిలుపు వ‌చ్చే అవ‌కాశం ఉంది. త‌న కోసం కాక‌పోయినా, చ‌ర‌ణ్ కోస‌మైనా ఛాన్స్ ఇవ్వొచ్చు. అయితే ముందుగా స‌రిలేరు నీకెవ్వ‌రు హిట్ట‌వ్వాలి. అలా అయితే గ‌నుక అనిల్ రావిపూడి పంట పండిన‌ట్టే.

ALSO READ: స్టైలిష్‌ స్టార్‌లో అవే ప్లస్‌ పాయింట్స్‌!