ENGLISH

అతిథిదేవోభవ మూవీ రివ్యూ & రేటింగ్!

07 January 2022-17:09 PM

నటీనటులు: ఆది సాయి కుమార్‌, నువేక్ష‌, రోహిణి, స‌ప్త‌గిరి తదితరులు
దర్శకత్వం : పొలిమేర నాగేశ్వర్
నిర్మాత: రాజబాబు మిర్యాల, అశోక్ రెడ్డి మిర్యాల
సంగీత దర్శకుడు: శేఖర్ చంద్ర
సినిమాటోగ్రఫీ: అమరనాథ్ బొమ్మిరెడ్డి
ఎడిటర్ : కార్తీక్ శ్రీనివాస్


రేటింగ్: 2/5


అన్ని అనుకున్నట్లు జరుగుంటే ఈ రోజు 'ఆర్ఆర్ఆర్' హంగామా వుండేది. కానీ కరోనా నేపధ్యంలో పెద్ద సినిమాలు వాయిదా పడ్డాయి, దీంతో చిన్న సినిమాలు అవకాశం దక్కింది. ఈ వరుసలో ఆది అతిథిదేవోభవ ప్రేక్షకుల ముందుకు వచ్చింది. చాలా రోజుల నుంచి ఆది విజయం కోసం ఎదురుచూస్తున్నాడు. మరి ఈ సినిమా అది విజయం ఇచ్చిందా ? ఇంతకీ ఏమిటీ అతిథిదేవోభవ కథ ? 


కథ:


అభయ్ (ఆది) చూడ్డానికి అందరిలానే సామాన్యంగా కనిపిస్తాడు. కానీ అతడికి మోనో ఫోబియా అనే డిసార్డర్ వుంటుంది. ఈ ఫోబియా వున్న వాళ్ళు ఒంటరితనం భరించలేరు. ఆ భయంలో చనిపోవడానికి కూడా సిద్ధపడతారు. అభయ్ కూడా ఈ సమస్యతో బాధపడుతుంటాడు. అభయ్ కి ఉన్న ప్రాబ్లం తెలుసుకొని తను ప్రేమించిన ఓ అమ్మాయి బ్రేకప్ చెప్పేసి వెళ్ళిపోతుంది. ఇదే సమయంలో  వైష్ణవి(నువేక్ష) ని తొలి చూపులోనే చూసి ప్రేమలో పడతాడు అభయ్. వైష్ణవి కూడా ప్రేమిస్తుంది. చివరి వీరి ప్రేమ కధ ఏమైయింది ? అభయ్ కి వైష్ణవి ప్రేమ దక్కుతుందా ? తన సమస్య నుంచి అభయ్ ఎలా బయటపడ్డాడు అనేది మిగిలిన కథ

 
విశ్లేషణ:


కొన్ని పాయింట్స్ అలోచించినపుడు అద్భుతంగా వుంటాయి. రాసినప్పుడు కూడా సూపర్ గా వస్తాయి. కానీ తెరమీదకి వచ్చేసరికి ఉప్పులేని పప్పులా చప్పగా అయిపోతాయి. అతిథిదేవోభవ కూడా ఇదే ఇబ్బంది. పాయింట్ బావుంది. కానీ అది స్క్రీన్ మీదకి వచ్చినపుడే చాలా సాదాసీదాగా అనిపించింది. మోనో ఫోబియా డిసార్డర్ తో బాధ పడే ఓ కుర్రాడు, ఆ విషయాన్ని బయటపెట్టలేక ఇబ్బంది పడుతూ ఉంటాడు. ఇక్కడి వరకూ బాగానే ఉంది. కానీ ఈ ఐడియాని స్క్రీన్ ప్లే చేయడం తడబడ్డారు.


బలమైన సన్నివేశాలు లేకపోవడం , కామెడీ పండకపోవడం, సాగాదీత కధనంలో సినిమా చప్పగా మారింది. మోనో ఫోబియా ఆసక్తిగానే పరిచయం చేశారు. కానీ అసలు కధలోకి వెళ్ళిన తర్వాత ఆసక్తి పూర్తిగా తగ్గిపోతుంది. పాయింట్ ఎమోషనల్ గా వీక్ అయిపోతుంది. కామెడీ కూడా సహజంగా పండలేదు. సెకెండ్ హాఫ్ మొదలైన తర్వాత  కామెడీ థ్రిల్లర్‌ కాస్త సైకో థ్రిల్ల‌ర్‌గా చూపించే ప్ర‌య‌త్నం చేశాడు దర్శకుడు. ఇది కూడా అసహంగా అనిపించింది.  క్లైమాక్స్ కూడా రెగ్యులర్ పంధాలో వెళ్ళిపోయింది. 


నటీనటులు:


అభ‌య్ పాత్ర ఆది కొత్త. పాత్ర పరిధి మేర చేశాడు. అయితే మోనోఫోబియాతో భ‌య‌ప‌డే స‌న్నివేశాల్లో  కొంచెం ఓవర్ గా అనిపిస్తుంది. యాక్షన్ సీన్స్ లో బాగానే చేశాడు. హీరోయిన్ నువేక్ష జస్ట్ ఓకే .  ఆది త‌ల్లి పాత్ర‌లో రోహిణి రెగ్యులర్ గా కనిపించింది.  స‌ప్త‌గిరి కామెడీ ట్రాక్ కొంత ఊరట, 


టెక్నికల్ గా: 


శేఖ‌ర్ చంద్ర నేపధ్య సంగీతం బావుంది. ఎడిటింగ్ ఇంకా శార్ఫ్ గా ఉండాల్సింది. అమ‌ర్‌నాథ్ ఛాయాగ్రహ‌ణం ఓకే.  నిర్మాణ విలువ‌లు అంతంత మాత్రంగానే ఉన్నాయి.


ప్లస్ పాయింట్స్ : 


కొత్త పాయింట్.. 
ఆది 


మైనస్ పాయింట్స్


బలహీనమైన కధనం 
అసహజంగా కొన్ని సన్నీవేషాలు
 

ఫైనల్ వర్దిక్ట్ : అలరించని 'అతిథి'

ALSO READ: బాల‌య్య కూడా ఇలా పెంచేస్తే ఎలా?