ENGLISH

బ్యాడ్ స్టార్ట్‌: తొలిరోజే ఫ్లాపుల ప‌రంప‌ర‌.

02 January 2020-15:10 PM

సంక్రాంతి సీజ‌న్‌ముందు సినిమాల్ని విడుద‌ల చేయ‌డానికి నిర్మాత‌లు భ‌య‌ప‌డుతుంటారు. కానీ.. ఈసారి మాత్రం అలాంటి భ‌యాలేం క‌నిపిచ‌డం లేదు. డిసెంబ‌రు చివ‌రి వారంలోనూ, జ‌న‌వ‌రి 1న సినిమాలు వ‌రుస క‌ట్టాయి. జ‌న‌వ‌రి 3న కూడా కొన్ని సినిమాలు రాబోతున్నాయి. జ‌న‌వ‌రి 1న విడుద‌లైన 4 సినిమాలూ మాత్రం తీవ్రంగా నిరాశ ప‌రిచాయి. కొత్త యేడాది తొలి రోజు బ్యూటిఫుల్, ఉల్లాల ఉల్లాల‌, తూటా, అత‌డే శ్రీ‌మ‌న్నారాయ‌ణ ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చాయి. నాలుగూ ఫ్లాపులే. ఈ నాలుగు సినిమాల‌కూ క‌నీసం ఓపెనింగ్స్ కూడా రాలేదు.

 

బ్యూటిఫుల్ బీ గ్రేడ్ సినిమాలా ఉంద‌ని ప్రేక్ష‌కులు తీర్పు ఇచ్చేశారు. అత‌డే శ్రీ‌మ‌న్నారాయ‌ణ మూడు గంట‌ల సీరియ‌ల్‌లా ఉంద‌ని సోష‌ల్ మీడియాలో కౌంట‌ర్లు వినిపిస్తున్నాయి. ధ‌నుష్ సినిమా తూటాని ఎవ్వ‌రూ ప‌ట్టించుకోలేదు. త‌మిళంలో నెల రోజుల క్రిత‌మే విడుద‌లైంది. అక్క‌డా ఫ్లాప్ టాకే వ‌చ్చింది. అందుకే ఈ సినిమాపై ఎవ‌రూ ఆస‌క్తి చూపించ‌లేదు. అలా.. తొలి రోజు వ‌రుస‌గా నాలుగు ఫ్లాపులు త‌గిలాయి. మ‌రి ఈ యేడాది ఎలా ఉంటుందో..?

ALSO READ: 'అత‌డే శ్రీమ‌న్నారాయ‌ణ‌' మూవీ రివ్యూ & రేటింగ్!