ENGLISH

బాల‌య్య కూడా ఇలా పెంచేస్తే ఎలా?

07 January 2022-13:00 PM

నిర్మాత‌ల‌కు ఎప్పుడూ అందుబాటులో ఉండే అగ్ర హీరోల్లో బాల‌కృష్ణ ఒక‌రు. ఎన్ని హిట్లొచ్చినా, బాల‌య్య త‌న పారితోషికాన్ని పెంచిన‌, దాఖలాలు లేవు. నిన్నా మొన్న‌టి వ‌ర‌కూ బాల‌య్య పారితోషికం రూ.5 నుంచి రూ.8 కోట్ల‌లోపే. `అఖండ‌`కు మాత్రం త‌ను రూ.10 కోట్ల పారితోషికం తీసుకున్న‌ట్టు భోగ‌ట్టా. ఇప్పుడు 50 శాతం పారితోషికం పెంచేసి, త‌న పారితోషికాన్ని రూ.15 కోట్ల‌కు చేర్చిన‌ట్టు టాక్.

 

అఖండ సూప‌ర్ హిట్ట‌య్యింది. ఈ సినిమా రూ.100 కోట్ల మైలు రాయి దాటేసింది. బాల‌య్య కెరీర్‌లో బిగ్గెస్ట్ హిట్ ఇది. అందుకే బాల‌య్య త‌న పారితోషికాన్ని రూ.15 కోట్ల‌కు పెంచేశాడ‌ని టాక్‌. ప్రస్తుతం మైత్రీ మూవీస్ తో ఓ సినిమా చేయ‌బోతున్నాడు బాల‌య్య‌. `అఖండ‌` రిలీజ్ కి ముందే ఈ సినిమా ఒప్పుకున్నాడు కాబ‌ట్టి... దీనికీ రూ.10 కోట్లే పారితోషికం. ఇప్పుడు రాబోయే సినిమాల‌కు మాత్రం రూ.15 కోట్లు స‌మ‌ర్పించుకోవాల్సిందే. ఎప్పుడూ లేనిది.. బాల‌య్య త‌న పారితోషికం పెంచేయ‌డం ఇండ్ర‌స్ట్రీ వర్గాల్లో చ‌ర్చ‌నీయాంశ‌మైంది. అయితే బాల‌య్య‌కు రూ.15 కోట్లు ఇవ్వ‌డం రీజ‌న్ బుల్ రేటే. ఎందుకంటే బాల‌య్య సినిమా అంటే నాన్ థియేట‌రిక‌ల్ నుంచే దాదాపుగా రూ.25 కోట్ల వ‌ర‌కూ వ‌స్తున్నాయి.

ALSO READ: ఈ ఇద్ద‌రు హీరోలూ ఏం సాధించిన‌ట్టు...?