ENGLISH

బిగ్‌బాస్‌ విన్నర్‌ కొత్త కారు కొన్నాడోచ్‌.!

08 January 2020-17:47 PM

బిగ్‌బాస్‌ సీజన్‌ 3లో డిఫరెంట్‌ ఆటిట్యూడ్‌ కనబరిచి అభిమానుల హృదయాల్ని కొల్లగొట్టిన కంటెస్టెంట్‌ రాహుల్‌ సిప్లిగంజ్‌ అనూహ్యంగా జీరో నుండి హీరో స్థాయికి ఎదిగి, సివరాఖరికి బిగ్‌బాస్‌ టైటిల్‌ గెలిచేశాడు. టైటిల్‌ గెలిస్తే, తన తల్లి తండ్రులకు సొంత ఇల్లు కొనిస్తానని చెప్పే రాహుల్‌, తన సొంతింటి కల నెరవేర్చుకున్నాడు. ఓ ఫ్లాట్‌ కొనేశాడు. అది రెడీ అవడానికి ఇంకా టైమ్‌ పడుతుందట. ఈ లోగా ఓ లగ్జరీ కారు కూడా కొనేశాడు. ఆ కారు పక్కనే నిలబడి స్టైల్‌గా ఓ చిల్డ్‌ థమ్స్‌ అప్‌ లాగించేస్తున్న ఫోటో ఒకటి సోషల్‌ మీడియాలో షేర్‌ చేసి, ఫ్యాన్స్‌ని ఖుషీ చేశాడు. బిగ్‌బాస్‌ కారణంగా తాను అనుకున్న కలల్ని నెరవేర్చుకున్న రాహుల్‌ని చూసి ఆయన ఫ్యాన్స్‌ సంతోషపడుతున్నారు.

 

బిగ్‌బాస్‌ నుండి వచ్చాక, రాహుల్‌కి సినిమాల్లో అవకాశాలు కూడా బాగా వస్తున్నాయంటూ ప్రచారం జరిగింది. అయితే, ఆ ప్రచారం ఎంత మేర కార్యరూపం దాల్చిందో తెలీదు కానీ, సింగర్‌గా మంచి అవకాశాలు మాత్రం దక్కించుకుంటున్నాడు. అన్నట్లు హౌస్‌లో ఉన్నన్ని రోజులూ, బిగ్‌బాస్‌ టైటిల్‌ గెలుచుకుని వచ్చిన మనీతో ఓ మంచి సెలూన్‌ పెడతానని తన బార్బర్‌ వృత్తి పట్ల గౌరవాన్ని చాటుకున్నాడు. మరి ఆ సంగతి ఎంతవరకూ వచ్చిందో. తెలీదు కానీ, మొత్తానికి ఓ కారుకు, ఓ ఇంటికి ఓనర్‌ అయిపోయాడు రాహుల్‌ సిప్లిగంజ్‌.

ALSO READ: గ్రాఫిక్స్‌లో సూప‌ర్ స్టార్‌ని సృష్టించారా?